• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KAMAL HAASAN LOKESH KANAGARAJ FILM UPDATE MALAYALI STAR FAHAD FASIL WILL BE SEEN AS VILLAIN SR

Kamal Haasan : కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ విక్రమ్‌లో విలన్ ఖరారు..

Kamal Haasan : కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ విక్రమ్‌లో విలన్ ఖరారు..

Kamal Haasan Vikram Photo : Twitter

Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    విశ్వనటుడు కమల్ హాసన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ ఆ టీజర్‌తో సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మొదట్లో విజయ్ సేతుపతి పేరు వినిపించినా కూడ ఆ తర్వాత మరో టాలెంటెడ్ నటుడు మలయాళీ స్టార్ ఫహాద్ ఫాజిల్ పేరు తెర మీదకు వచ్చింది.
    అంతేకాదు ఫహాద్ పాజిల్ దాదాపు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులు ఇది కేవలం ఒక ఊహాగానంగానే ఉన్నా ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయింది. ప్రతినాయకుడిగా అతనే ఫైనల్ అయ్యారట. ఫహాద్ ఫాజిల్ తెలుగులో కూడా ఓ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న పుష్పలో ఫహాద్ నటిస్తున్నాడ. అంతేకాదు ఆయన అల్లు అర్జున్‌తో తలపడనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    ఇక కమల్ హాసన్ విక్రమ్ సినిమా విషయానికి వస్తే.. విలక్షణ నటుడు కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల వాయిదా పడి మరోసారి పున: ప్రారంభమైంది. కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మించనున్న 50వ సినిమా. ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్‌ నటించిన 'మాస్టర్‌' చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. లోకేష్ దర్శకత్వంలో గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం 'ఖైదీ'. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.


    ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇటు తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, దానికి తోడు మంచి తండ్రి కూతురు సెంటిమెంట్.. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే రీతిలో కథ కథనాలు, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగణ్‌ హీరోగా నటించనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: