జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను క‌మ‌ల్ హాసన్ రాజ‌కీయాల్లోకి ర‌మ్మంటున్నాడా.. ట్వీట్ అర్థ‌మేంటి..?

ఏమో.. క‌మ‌ల్ హాస‌న్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. క‌మ‌ల్ అంత‌గా ఏం చేసాడో అనుకుంటున్నారా.. ఏం లేదు సింపుల్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 20, 2019, 6:29 PM IST
జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను క‌మ‌ల్ హాసన్ రాజ‌కీయాల్లోకి ర‌మ్మంటున్నాడా.. ట్వీట్ అర్థ‌మేంటి..?
జూనియర్ ఎన్టీఆర్ కమల్ హాసన్
  • Share this:
ఏమో.. క‌మ‌ల్ హాస‌న్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. క‌మ‌ల్ అంత‌గా ఏం చేసాడో అనుకుంటున్నారా.. ఏం లేదు సింపుల్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే అంద‌రిలా నార్మ‌ల్ విషెస్ చెబితే బాగున్ను కానీ క‌మ‌ల్ మాత్రం కాస్త కొత్త‌గా ట్రై చేసాడు. అక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. మే 20న జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. దాంతో సోష‌ల్ మీడియాలో నంద‌మూరి చిన్నోడికి వేల‌ల్లో బ‌ర్త్ డే విషెస్ వ‌చ్చాయి. అందులో క‌మ‌ల్ కూడా ఉన్నాడు. హ్యాపీ బ‌ర్త్ డే ఎన్టీఆర్.. ఇప్పుడు నువ్వు జూనియ‌ర్ కాదు సీనియ‌ర్.. ఎంజాయ్ అంటూ ట్వీట్ చేసాడు క‌మ‌ల్ హాస‌న్.
Kamal Haasan Interesting tweet on Jr NTR Birthday.. Is Kamal wants Nandamuri hero in Politics pk..  ఏమో.. క‌మ‌ల్ హాస‌న్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. క‌మ‌ల్ అంత‌గా ఏం చేసాడో అనుకుంటున్నారా.. ఏం లేదు సింపుల్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. jr ntr,jr ntr twitter,kamal haasan,kamal haasan twitter,kamal haasan tweet on jr ntr,jr ntr political entry,jr ntr tdp,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday,ntr birthday,ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday celebrations 2019,jr ntr latest news,ntr birthday celebration photos,ntr birthday special video,telugu cinema,కమల్ హాసన్,కమల్ హాసన్ జూనియర్ ఎన్టీఆర్,ఎన్టీఆర్ బర్త్ డే రోజు కమల్ ట్వీట్,తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు
జూనియర్ ఎన్టీఆర్

ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర లేపుతుంది. ఇప్పుడు నువ్వు జూనియ‌ర్ కాదు సీనియ‌ర్ అంటున్నాడంటే దాని అర్థం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు విశ్లేష‌కులు. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నాడు. దాంతో త‌న మాదిరే ఎన్టీఆర్‌ను కూడా రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. ఒక్క ట్వీట్ చేసి ఇలా ఎన్నో స‌మాధానం లేని ప్ర‌శ్న‌ల‌కు తెర‌లేపాడు క‌మ‌ల్ హాస‌న్. బ‌ర్త్ డే విషెస్ వ‌ర‌కు అర్థ‌మైనా కూడా జూనియ‌ర్ కాదు సీనియ‌ర్ అనే ప‌దం ద‌గ్గ‌రే అంతా ఆగిపోతున్నారు ఇప్పుడు.ఇదే కొత్త చ‌ర్చ‌కు తావిస్తుంది. ఎంత బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకున్నా కూడా క‌మ‌ల్ పెట్టిన ఈ ట్వీట్ అర్థం మాత్రం ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. దీని వెన‌క ఆయ‌న అంత‌రార్థం జూనియ‌ర్‌ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆహ్వానిస్తున్నట్లా.. ఇంక ఇప్ప‌ట్నుంచి సినిమాల‌తో పాటు రాజ‌కీయాలు కూడా చూసుకో అంటూ మేల్కొల్పిన‌ట్లా.. లేదంటే మీ తాత మాదిరే నువ్వు కూడా సినిమాలు అయిన త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పార్టీ ప‌నులు చూసుకో అని చెప్పిన‌ట్లా.. ఏదీ అర్థం కాక నంద‌మూరి అభిమానుల‌తో పాటు రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా త‌ల ప‌ట్టుకుంటున్నారు.
Kamal Haasan Interesting tweet on Jr NTR Birthday.. Is Kamal wants Nandamuri hero in Politics pk..  ఏమో.. క‌మ‌ల్ హాస‌న్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. క‌మ‌ల్ అంత‌గా ఏం చేసాడో అనుకుంటున్నారా.. ఏం లేదు సింపుల్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. jr ntr,jr ntr twitter,kamal haasan,kamal haasan twitter,kamal haasan tweet on jr ntr,jr ntr political entry,jr ntr tdp,jr ntr birthday,jr ntr birthday celebrations,jr ntr birthday,ntr birthday,ntr birthday celebrations,jr ntr birthday special,jr ntr birthday celebrations 2019,jr ntr latest news,ntr birthday celebration photos,ntr birthday special video,telugu cinema,కమల్ హాసన్,కమల్ హాసన్ జూనియర్ ఎన్టీఆర్,ఎన్టీఆర్ బర్త్ డే రోజు కమల్ ట్వీట్,తెలుగు సినిమా,జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు
జూనియర్ ఎన్టీఆర్
ఏదేమైనా ఇలాంటి వివాదాస్ప‌ద‌మైన ట్వీట్లు చేయ‌డంలో క‌మ‌ల్ ఎప్పుడూ ముందే ఉంటాడు. మ‌రి లోక‌నాయ‌కుడు చేసిన ఈ ట్వీట్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి. ఆయ‌న కూడా క‌మ‌ల్ చెప్పిన‌ట్లు తాను జూనియ‌ర్ కాదు సీనియ‌ర్ అని ఒప్పుకుంటాడో లేదంటే నాకింకా టైమ్ ఉంద‌ని ఎప్ప‌ట్లాగే త‌ప్పించుకుంటాడో చూడాలి.
First published: May 20, 2019, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading