Kamal Haasan | Vikram | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ సినిమా (Vikram) ‘విక్రమ్’. ఈ సినిమాకు (Lokesh Kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. మరో తమిళ నటుడు సూర్య (Suriya) కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా జూన్ 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్లను రాబడుతోంది. ఒక్క తమిళనాడులోనే రూ. 130 కోట్లు వసూలు చేసి కమల్ హాసన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదరగొడుతోంది. దీంతో ఈ సినిమా విజయం పట్ల కమల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను 300 కోట్లను తక్కువ సమయంలో సంపాదించగలను అని చెప్పినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అది విక్రమ్ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాతో వచ్చిన లాభాలతో నేను వెంటనే నా అప్పులన్నీ తీర్చుతాను. అంతేకాకుండా నాకు నచ్చిన ఆహారాన్ని తింటాను. నా స్నేహితులకు, ఫ్యామిలీకి అండగా ఉంటాను' అని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక కలెక్షన్స్ విషయంలో ఈ చిత్రం తమిళనాడులో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ తమిళనాడు రాష్ట్రంలో 155 కోట్లు రాబట్టి కేక పెట్టించింది. ఇక కమల్ విక్రమ్ ఇప్పటికే 2 వారాల్లో అక్కడ 130 కోట్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి ఎంతో దూరంలో లేదని అంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు కలెక్షన్స్ విషయానికి వస్తే.. తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చిన చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి మంచి వసూళ్లను అందుకుంది. ఈ సినిమా తెలుగులో 25 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుని కేక పెట్టించింది.
When I said that I can earn 300CR in a snap,nobody understood it.They thought that I was beating my chest. You can see now it's coming
"I'll repay all my loans, I'll eat to my heart's content & I’ll give whatever I can to my family and frnds.@ikamalhaasan on #vikram's success pic.twitter.com/3FUomUMzr9
— Thyview (@Thyview) June 15, 2022
ఇక విక్రమ్ 12వ రోజు తెలుగు రాష్ట్రాలలో 32 లక్షల షేర్‌ను అందుకుంది. వరల్డ్ వైడ్‌గా 12.90 కోట్ల గ్రాస్, 6.30 కోట్ల షేర్‌ను అందుకుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక తెలుగులో 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి ఈ సినిమా ఏకంగా 6.68 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమా మొత్తంగా 100 కోట్ల బిజినెస్ చేయగా.. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 60 కోట్ల ప్రాఫిట్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. హాట్ స్టార్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలకు చెందిన ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
లోకేష్ (Lokesh K
anagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. ఇక మరో కారణం (Vikram) ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ నటించడం కూడా కలిసి వచ్చింది. ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇది ఆ బ్యానర్లో వచ్చే 50వ సినిమా. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamal hassan, Vikram Movie