కమల్ హాసన్ పెద్ద మనసు.. జర్నలిస్టులకు ఆర్థిక సాయం..

Kamal Haasan: కమల్ హాసన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే అందులో మీడియా వాళ్లు కూడా ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 9, 2020, 3:30 PM IST
కమల్ హాసన్ పెద్ద మనసు.. జర్నలిస్టులకు ఆర్థిక సాయం..
కమల్ హాసన్
  • Share this:
కమల్ హాసన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే అందులో మీడియా వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా కొన్ని కంపెనీలు సరైన జీతాలు ఇవ్వడం లేదనే వాదన కూడా ఉంది. అయితే తమ ప్రాణాలను పణంగా పెట్టి వార్తలను సేకరిస్తున్న వాళ్ల కోసం కమల్ హాసన్ ఇప్పుడు నడుం బిగించాడు. వాళ్లను ఆదుకోవడానికి ముందుకొచ్చాడు లోక నాయకుడు. నావెల్ కరోనా, కోవిడ్-19 సోకడంతో చికిత్స తీసుకుంటున్న జర్నలిస్టులకు ఆయన సాయం అందించారు. ఒక్కొక్కరికీ 15 వేల రూపాయల చొప్పున 40 మంది జర్నలిస్టులకు 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు కమల్ హాసన్.
కమల్‌ హాసన్ (Twitter/Photo)
కమల్‌ హాసన్ (Twitter/Photo)

ఈయన సాయం పట్ల తమిళనాడు రాష్ట్రంలో జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. యువ హీరో, కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ కూడా తమిళనాడులోని కొందరు జర్నలిస్టులకు సాయం చేశారు. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన 60 మంది జర్నలిస్టులకు ఆయన సహాయం చేసాడు. ఒక్కొక్కరికీ మూడు వేల రూపాయల చొప్పున లక్ష 80 వేల రూపాయలు అందించాడు ఉదయనిధి. లాక్‌డౌన్ కొనసాగితే వచ్చే నెల కూడా ఇలాగే సాయం చేస్తానని మాటిచ్చాడు ఈయన. మరోవైపు కమల్ కూడా తనకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉన్నాడు.
First published: May 9, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading