మద్యం అమ్మకాలపై నిప్పులు చెరిగిన కమల్ హాసన్..

Kamal Haasan: 45 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత ఉన్నట్లుండి కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఎన్నో రోజులుగా మూతపడి ఉన్న మద్యం షాపులు అన్నీ తెరుచుకున్నాయి. దాంతో వేలాది మంది మందు బాబులు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 6, 2020, 2:39 PM IST
మద్యం అమ్మకాలపై నిప్పులు చెరిగిన కమల్ హాసన్..
కమల్‌ హాసన్ (Twitter/Photo)
  • Share this:
45 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత ఉన్నట్లుండి కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఎన్నో రోజులుగా మూతపడి ఉన్న మద్యం షాపులు అన్నీ తెరుచుకున్నాయి. దాంతో వేలాది మంది మందు బాబులు వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఇదంతా చూసి మిగిలిన వాళ్లకు కూడా భయం పట్టుకుంది. అందులో ఒక్కరికి కరోనా ఉన్నా కూడా ఏంటి పరిస్థితి అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలపై కొందరు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. అయితే ఆదాయం కోసం మద్యం తప్ప మరో మార్గం లేదన్నట్లు కొందరు చెప్తుండటంతో సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ దీనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కమల్ హాసన్, ప్రధాని మోదీ (Kamal Haasan Narendra Modi)
కమల్ హాసన్, ప్రధాని మోదీ (Kamal Haasan Narendra Modi)


మద్యం అమ్మకాల ఆదాయం కూడా కోట్ల కోటలు దాటేస్తుంది. ఏపీలో ఒక్కరోజు 60 కోట్లకు పైగా వచ్చింది.. ఇక కర్ణాటకలో 45 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే తమిళనాడులో మాత్రం మే 7 వరకు లాక్‌డౌన్ విధించారు. అక్కడ ఇంకా మద్యం విక్రయాలు మొదలు పెట్టలేదు. కానీ పక్కనే ఉన్న ఏపీ, కర్ణాటకలో ప్రారంభించడంతో ఇప్పుడు తమిళనాడులో కూడా మే 7నుంచి మద్యం ప్రారంభించేందుకు అక్కడి సర్కార్ సిద్ధమైంది. తమిళనాడులో మద్యం అమ్మకాలపై తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ మండి పడ్డాడు.

కమల్ హాసన్ (Kamal Haasan)
కమల్ హాసన్ (Kamal Haasan)


కరోనా వ్యాప్తి వేంగా ఉన్న తరుణంలో లాక్‌డౌన్ విధించింది అందుకే అయినపుడు ఇప్పుడు మద్యం దుకాణాలు తెరిస్తే ఎలా అంటూ అమ్మకాల నిర్ణయాన్ని తప్పు పట్టాడు కమల్. మద్యం దుకాణాలను తిరిగి ప్రారంభించి ప్రజారోగ్యంతో ఆటలు ఆడుకోవాలనుకుంటున్నారా అంటూ కమల్ ప్రశ్నించాడు. దేశంలో, రాష్ట్రంలో కరోనా రోజురోజుకీ పెరిగిపోతుంటే ఇంకా కఠినంగా వ్యవహరించాల్సింది పోయి ఇలా మద్యం షాపులు తెరిచి ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతారా అని విమర్శించాడు కమల్ హాసన్.

కమల్ హాసన్ (Kamal Haasan)
కమల్ హాసన్ (Kamal Haasan)


తమిళనాడులో మొన్న ఒక్కరోజే 508 కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇలాంటి సమయంలో మద్యం షాపులు తెరిస్తే సామాజిక దూరం ఎవ్వడూ పాటించడు.. అక్కడ అంత జ్ఞానం ఉండదంటూ మండి పడ్డాడు కమల్. దీని వల్ల ఆ వ్యక్తికే కాదు.. అతడి కుటుంబానికి, సమాజానికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని విమర్శించాడు కమల్. తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. వెంటనే ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్ణయాన్ని విరమించుకోవాలని కమల్ డిమాండ్ చేసాడు.
Published by: Praveen Kumar Vadla
First published: May 6, 2020, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading