కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ లుక్ అదిరిందిగా..

Kamal Haasan Bharatheeyudu 2 | శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ సినిమా అప్పట్లో భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పోస్టర్‌ను రిలీజ్ చేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 18, 2019, 2:05 PM IST
కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ లుక్ అదిరిందిగా..
‘భారతీయుడు 2’లో కమల్ హాసన్
  • Share this:
శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ సినిమా అప్పట్లో భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ‘భారతీయుడు2’ విడుదలైన 22 యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్‌లు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ చేస్తున్నారు.

ఈరోజు ఉదయమే చెన్నైలో  పూజా కార్యక్రమాలతో ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ సేనాపతి లుక్‌లో హాజరయ్యారు.

https://telugu.news18.com/news/movies/nagarjuna-naga-chaitanya-to-act-together-in-bangarraju-movie-ta-123288.html
‘భారతీయుడు 2’ పూజా కార్యక్రమాలు


 కాజల్‌తో పాటు చిత్ర సంబంధించిన టెక్నీషియన్స్ హాజరయ్యారు. ఈ రోజు నుంచే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ చిత్రీకరించనున్నారు. లంచగొండి తనానికీ వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించింది. కమల్‌ హాసన్‌ ద్విపాత్రాభినయానంలో నటించిన ఈ చిత్రంలో ముసలి కమల్‌ హాసన్‌ పాత్ర ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ లుక్ అదిరిందిగా.., kamal Haasan Bharatheeyudu 2 Telugu Version First Look Poster Released, kamal Haasan, Bharatheeyudu 2, Telugu Version First Look Poster Released,కమల్ హాసన్, భారతీయుడు 2, కమల్ భారతీయుడు 2, కమల్ హాసన్ భారతీయుడు 2, శంకర్, లుక్ అదిరిందిగా..
‘భారతీయుడు 2’లో కమల్ హాసన్


ఇందులో పోస్టర్‌పై ‘వృద్ధుడు.. తెలివైనవాడు.. గట్టివాడు..’ అంటూ క్యాప్షన్‌ ఇవ్వగా, రేపటి నుంచి షూటింగ్‌ ప్రారంభం అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పోస్టర్‌ను రిలీజ్ చేసారు. తమిళంలో మాత్రం ఖాకీ దుస్తులు ధరించిన సేనాపతి పాత్రలో కమల్‌ లుక్‌ అభిమానులను అలరిస్తోంది. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్..‘భారతీయుడు 2’ తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టి పూర్తి సమయాన్ని పాలిటిక్స్‌కు కేటాయించనున్నాడు.

లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో సిద్ధార్థ్, దుల్కర్ సల్మాన్, శింబులు ఇంపార్టెంట్ రోల్స్ చేయనున్నట్టు సమాచారం. ‘భారతీయుడు 2’ లో విలన్‌గా అక్షయ్ కుమార్ విలన్‌గా నటించే అవకాశాలున్నాయి. ఈ సినిమా సమ్మర్‌ వరకు కంప్లీట్ చేసి వచ్చే  సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 22 యేళ్ల క్రితం సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ సినిమాకు  సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ సినిమా ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీమ్‌తో క్రిష్ చిట్‌చాట్ ఇవి కూడా చదవండి 

గెట్ రెడీ ఫ్యాన్స్.. ‘సాహో’ ట్రైలర్ ఎలా ఉండబోతుందో తెలుసా..

రజినీకాంత్ ‘పేట’ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సిమ్రాన్

స్మృతిలో: ఎన్టీఆర్ వర్థంతి..అన్నగారికి ఆత్మీయ నివాళి
First published: January 18, 2019, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading