హోమ్ /వార్తలు /సినిమా /

Suriya: చాలా గర్వంగా ఉంది.. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయ్.. కమల్ హాసన్ విషెస్

Suriya: చాలా గర్వంగా ఉంది.. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయ్.. కమల్ హాసన్ విషెస్

కమల్ హాసన్, సూర్య

కమల్ హాసన్, సూర్య

ఇటీవలే విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సూర్య ప్రత్యేక పాత్రలో నటించి విషయం తెలిసిందే. భారీ వసూళ్లతో అరదరగొట్టిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “విక్రమ్” నిలిచింది.

తమిళ స్టార్ హీరో సూర్యకు మరో అరుదైన  గౌరవం దక్కింది. సూర్యకు అస్కార్ అవార్డ్‌ వేడుకకు ఆహ్వానం అందింది. దీంతో తమిళ్ ఇండస్ట్రీలో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు తమిళ్ ప్రజలు, సూర్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్కార్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడిగా సూర్య ఎంపికయ్యాడు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం అందుకున్న తొలి హీరో సూర్యనే కావడం విశేషం. 2022 అస్కార్ అవార్డ్స్ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 397 మంది సినీ ప్రముఖులను ఆర్గనైజింగ్‌ కమిటీకి ఎంపిక చేశారు.

అరుదైన ఘనత సాధించిన మన హీరో సూర్యకు ఈ ప్రౌడ్ మూమెంట్ పై అనేకమంది సినిమా ప్రముఖులు కూడా కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరి తన సినిమా హీరో విక్రమ్ కమల్ హాసన్ కూడా తన బెస్ట్ విషెష్ ని తెలియజేయడం ఆసక్తిగా మారింది. నా బ్రదర్ సూర్య కి ఈ పిలుపు వచ్చినందనుకు చాలా గర్వంగా ఉందని సూర్య ని జస్ట్ ఆ మూమెంట్ ని ప్రౌడ్ గా ఎంజాయ్ చెయ్యమని సూచిస్తూ కమల్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు మరింత  వైరల్ గా మారింది.


ఇటీవలే విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సూర్య ప్రత్యేక పాత్రలో నటించి విషయం తెలిసిందే. భారీ వసూళ్లతో అరదరగొట్టిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “విక్రమ్” సినిమాను దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించాడు. ఇందులో కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లు సాలిడ్ రోల్స్ లో కనిపించారు. ఇక వీరి కన్నా అయితే స్టార్ హీరో సూర్య చేసిన రోలెక్స్ అయితే ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేసింది.

ఇదిలా ఉంటే అస్కార్ అవార్డ్  వేడుకలకు బాలీవుడ్‌ నుంచి నటి కాజోల్‌, దర్శకురాలు రీమా కగ్తి, సుస్మితా ఘోష్‌, రీంతు థామస్‌, నిర్మాత ఆదిత్య సూద్‌ ఉన్నారు. సౌతిండియా నుంచి హీరో సూర్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అయితే సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) సినిమా భారత్‌ నుంచి 93వ ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా వెళ్లగా, ‘జై భీమ్‌’ సినిమా 94వ ఆస్కార్‌ షార్ట్‌ లిస్టులో ఎంపిక కాలేదు.

First published:

Tags: Hero suriya, Kamal haasan, Kollywood, Suriya

ఉత్తమ కథలు