కమల్ హాసన్‌, బాలకృష్ణ మల్టీస్టారర్ అలా మిస్సైయింది..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్,నందమూరి బాలకృష్ణ ఎవరి స్టైల్ వారిది. మాస్‌లో వీళ్లిద్దరికీ ప్రత్యేక అభిమానులున్నారు. ఇక వీళ్లిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ ఆ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లలేదు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: November 20, 2019, 7:57 AM IST
కమల్ హాసన్‌, బాలకృష్ణ మల్టీస్టారర్ అలా మిస్సైయింది..
కమల్ హాసన్,బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
యూనివర్సల్ హీరో కమల్ హాసన్,నందమూరి బాలకృష్ణ ఎవరి స్టైల్ వారిది. మాస్‌లో వీళ్లిద్దరికీ ప్రత్యేక అభిమానులున్నారు. ఇక వీళ్లిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ ఆ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లలేదు. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ తన సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుత పాత్రల్లో నటించారు. అలాంటి సినిమాల్లో ‘ఆదిత్య 369’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ ..శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో అద్భుతాభినయాన్ని కనబరిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను సింగీతం శ్రీనివాస రావు అనితర సాధ్యంగా తెరకెక్కించారు. తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి నిచ్చింది. ఈ సినిమా టీవీల్లో ప్రసారమయితే.. ఇప్పటికీ ప్రేక్షకులు స్మాల్ స్క్రీన్‌కు అతుక్కుపోతారు.

kamal haasan balakrishna multistarer movie miss due these reasons,balakrishna,kamal haasan,balakrishna kamal haasan,balakrishna kamal haasan aditya 369,aditya 369 kamal haasan,kamal haasan,chiranjeevi,chiranjeevi vs balakrishna,balakrishna aditya 369,aditya 369,chiranjeevi pramotes balakrishna aditya 369 movie,sye raa narasimha reddy movie review,balakrishna facebook,balakrishna instagram,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi twitter,balakrishna twitter,balayya,nbk,chiru,megastar chiranjeevi,nandamuri balakrishna,balakrishna movies,megastar chiranjeevi,balakrishna chiranjeevi,balakrishna 100th movie,chiranjeevi balakrishna,chiranjeevi movies,chiranjeevi speech,#chiranjeevi,#balakrishna,chiranjeevi latest news,chiranjeevi 150th movie,balakrishna vs chiranjeevi,balakrishna about chiranjeevi,balakrishna new movie,mega star chiranjeevi,balakrishna new look,balakrishna songs,tollywood,telugu cinema,బాలకృష్ణ,చిరంజీవి,బాలకృష్ణ ఆదిత్య 369 చిరంజీవి,చిరంజీవి ఆదిత్య 369,బాలకృష్ణ ఆదిత్య 369,ఆదిత్య 369,ఆదిత్య 369 సినిమాను ప్రమోట్ చేసిన చిరంజీవి,చిరంజీవి,బాలకృష్ణ,బాలయ్య,చిరు,మెగాస్టార్ చిరంజీవి,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ,కమల్ హాసన్,బాలకృష్ణ,బాలకృష్ణ కమల్ హాసన్,బాలకృష్ణ కమల్ హాసన్ ఆదిత్య 369
‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణదేవరాయులుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో మెప్పించిన నట సింహం (యూట్యూబ్ క్రెడిట్)


బాలకృష్ణ.. ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ముందుగా కృష్ణ కుమార్ పాత్ర కోసం కమల్ హాసన్‌ను అనుకున్నారట దర్శక నిర్మాతలు. ఎందుకంటే.. సింగీతం అంతకు ముందు కమల్ హాసన్‌తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. మరోవైపు శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కోసం బాలకృష్ణ అయితే బాగుంటుందని ఆ పాత్ర బాలయ్య చేస్తేనే వంద శాతం న్యాయం చేయగలరని ఆయన్ని ఎంపిక చేశారట. కృష్ణకుమార్ పాత్రకు మాత్రం కమల్ హాసన్ ఆల్రెడీ ఓకే కూడా చెప్పారట. ఈ ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిందామనుకున్నారు. అయితే.. అప్పటికే కమల్ హాసన్.. మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో ‘ఆదిత్య 369’  ప్రాజెక్టులో నటించేందుకు సాధ్యం పడలేదు. దీంతో బాలకృష్ణ రెండు పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టకోవడం అందరికీ తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 20, 2019, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading