KAMAL HAASAN AS VILLAIN IN PRASHANTH NEEL NTR 31 MOVIE SB
NTR 31: ఎన్టీఆర్‌కు విలన్‌గా ప్రముఖ హీరో... ఎవరో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
ఎన్టీఆర్ 31 పోస్టర్ రిలీజ్
ఎన్టీఆర్ 31వ చిత్రంగా వస్తున్న సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో ప్రముఖ హీరో నటించనున్నట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్(RRR) తర్వా ఎన్టీర్(NTR) రెండు సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఇటీవలే తారక్ బర్త్ డే సందర్భంగా రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్ వచ్చేశాయి. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో కొరటాల(Koratala Siva)తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ 31 సినిమా ప్రముఖ కేజీఎఫ్ (KGF)డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో(Prashanth Neel) కలిసి చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తర్వాత ఓ వైపు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సాలార్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది
కేజీఎఫ్‌ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించి యావత్ దేశ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ షూటింగ్ దశలో ఉండగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని ప్రకటించాడు ప్రశాంత్ నీల్. తారక్ పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీబర్త్‌డే ఎన్టీఆర్ 31' ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ పోస్టర్లో తారక్ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ ఎంత మాస్‌గా ఉండబోతుందో రివీల్ చేసి ప్రేక్షకులను, అభిమానులకు షాక్ ఇచ్చాడు.
కేజీఎఫ్‌లో హీరోను ఏరేంజ్‌లో చూపించాడు.. అందులో నటించే.. విలన్లను కూడా అదే రేంజ్లో చూపించాడు ప్రశాంత్ నీల్. విలన్‌ను కూడా క్రూరంగా భయంకరంగా చూడగానే దడ పుట్టించేలా క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 31వ చిత్రంగా వస్తున్న సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ను బరిలోకి దించనున్నాడట. ఇటీవల విడుదలై విక్రమ్ ట్రైలర్లో కమల్ లుక్స్ మాస్‌గా, రఫ్‌గా కనిపించడంతో ఆయన అయితేనే ఈ మూవీలో విలన్ రోల్‌కు సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ భావించినట్లు సమాచారం.
అయితే ఈ సినిమా కథను కమల్ హాసన్‌కు వినిపించగా, ఆయన కూడా కథ బాగా నచ్చి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. 'ఇదెక్కడి మాస్ ఐడియా నీల్ మావా' అనుకుంటున్నారు. దీంతో ఇదే నిజమైతే ఇటు ఎన్టీఆర్, అటు కమల్ హాసన్ యాక్టింగ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఏ విలన్‌కు ఓటేస్తాడో తెలియాల్సిందే.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.