భారతీయుడు 2 విషయంలో.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన కమల్ హాసన్..

అగ్ర కథానాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నాయకుడు కమల్ హాసన్‌ మద్రాస్ హైకోర్టును మెట్లు ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: March 17, 2020, 5:41 PM IST
భారతీయుడు 2 విషయంలో..  మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన కమల్ హాసన్..
కమల్‌ హాసన్ (Twitter/Photo)
  • Share this:
అగ్ర కథానాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నాయకుడు కమల్ హాసన్‌ మద్రాస్ హైకోర్టును మెట్లు ఎక్కాడు. వివరాల్లోకి వెళితే..  ఈయనను గత కొన్ని రోజులుగా పోలీసులు వేదిస్తున్నట్టు మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు. భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటనలో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ దుర్ఘటపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే  ఈ ప్రమాద ఘటన జరిగిందనే దానిపై చెన్నై పోలీసులు ‘భారతీయుడు 2’ చిత్ర యూనిట్‌పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు శంకర్‌తో పాటు లైకా ప్రొడక్షన్ వాళ్లతో పాటు కమల్ హాసన్‌ను కూడా పోలీసులు చెన్నైలోని పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు పిలిపించి పలుమార్లు విచారించారు.

chennai police interrogates kamal haasan in probe into bharateeyudu 2 film sets,Kamal Haasan,police interrogates kamal haasan,kamal haasan bharatheeyudu 2 sets,Kamal Haasan twitter,Kamal Haasan indian 2 movie,Kamal Haasan indian 2 movie sets,kamal haasan 1 crore help,telugu cinema,భారతీయుడు 2, భారతీయుడు 2 ప్రమాద మృతులకు కోటి సాయం చేసిన కమల్ హాసన్,కమల్ హాసన్‌ను విచారించిన చెన్నై పోలీసులు
పోలీసుల ఎదుట విచారణకు హాజరైన కమల్ హాసన్ (Twitter/Photo)


ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణ సాగుతోంది. ఈ సందర్భంగా పోలీసులు తనను అనవసరంగా వేదిస్తున్నారంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. పోలీసులు తనను ఎపుడు పడితే అపుడు పిలిచి తన కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నట్టు తెలిపాడు. కమల్ హాసన్ అభ్యర్థనపై హైకోర్టు ఈ పిటిషన్ స్వీకరించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమాద ఘటనతో పాటు కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతానికి వాయిదా పడింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 17, 2020, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading