భారతీయుడు 2 ప్రమాద టెక్నీషియన్‌లకు కమల్ హాసన్ కోటి సాయం..

Indian 2 accident: భారతీయుడు 2 సెట్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం సంచలనంగా మారిపోయింది. ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2020, 5:20 PM IST
భారతీయుడు 2 ప్రమాద టెక్నీషియన్‌లకు కమల్ హాసన్ కోటి సాయం..
Indian 2 Accident : ప్రమాదంపై కమల్‌హాసన్ విచారం... బాధితులు కోలుకోవాలంటూ ట్వీట్ (File)
  • Share this:
భారతీయుడు 2 సెట్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం సంచలనంగా మారిపోయింది. ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అందులో దర్శకుడు శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు ఉన్నాడు. ఆ కుర్రాడి వయసు 29 సంవత్సరాలు మాత్రమే. ఇక 34 ఏళ్ల అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కూడా అక్కడే చనిపోయాడు. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కమల్ అక్కడికి వెళ్లి అందరికీ సాయం చేసాడు. అక్కడే ఉండి గాయపడిన వాళ్లను హాస్పిటల్ తీసుకెళ్లాడు.
Indian 2 Accident : ప్రమాదంపై కమల్‌హాసన్ విచారం... బాధితులు కోలుకోవాలంటూ ట్వీట్ (File)
Indian 2 Accident : ప్రమాదంపై కమల్‌హాసన్ విచారం... బాధితులు కోలుకోవాలంటూ ట్వీట్ (File)

అంతేకాదు సోషల్ మీడియాలో తన సంతాపం వ్యక్తం చేసాడు. ఇప్పటి వరకు మాతో పని చేసిన వాళ్లే ఇప్పుడు లేరని చెప్పడానికి చాలా బాధగా ఉంది.. ఈ ప్రమాదం కన్నీరు పెట్టించేది.. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరక్కూడదని కోరుకుంటున్నానని ట్వీట్ కూడా చేసాడు. ఇక ఇదిలా ఉంటే చనిపోయిన టెక్నీషియన్స్ కుటుంబాలకు కోటి రూపాయలు సాయం ప్రకటించాడు కమల్ హాసన్. నిర్మాత సంస్థ లైకా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించలేదు. కచ్చితంగా వాళ్లతో పాటు దర్శకుడు శంకర్ కూడా సాయం చేస్తాడని తమిళ మీడియా చెబుతుంది.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు