అదిరిపోయిన కమల్ హాసన్ 'ఇండియన్2' ఫస్ట్‌లుక్‌..

డైరెక్టర్‌ శంకర్‌ తన సినిమాల్లో సామాజిక అంశాల్నీ నేపథ్యంగా తీసుకుంటూనే.. కమర్షియల్ హంగులు మిస్సవకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఆ కోవలోనిదే 1996లో వచ్చిన 'భారతీయుడు'. మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'భారతీయుడు2' రాబోతోంది.

news18-telugu
Updated: January 18, 2019, 5:57 AM IST
అదిరిపోయిన కమల్ హాసన్ 'ఇండియన్2' ఫస్ట్‌లుక్‌..
Kamal Haasan in Indian 2
  • Share this:
డైరెక్టర్‌ శంకర్‌ తన సినిమాల్లో సామాజిక అంశాల్నీ నేపథ్యంగా తీసుకుంటూనే.. కమర్షియల్ హంగులు మిస్సవకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఆ కోవలోనిదే 1996లో వచ్చిన 'భారతీయుడు'..ఈ సినిమాను 'ఇండియన్‌'గా మొదట తమిళ్‌లో తీసి తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమాలో హీరోగా కమల్‌ హాసన్‌ నటించింది తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. కమల్‌ హాసన్‌ ద్విపాత్రాభినయానంలో నటించిన ఈ చిత్రంలో వృద్ద కమల్‌ హాసన్‌ పాత్ర ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'భారతీయుడు2' రాబోతోంది.

ఇండియన్2' ఫస్ట్‌లుక్‌
ఇండియన్2' ఫస్ట్‌లుక్‌


లాచనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించేసిన చిత్రయూనిట్‌... మర్మకళలో చేతివేళ్లను ఉపయోగించేలా తీరును చూపిస్తూ ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం.. తాజాగా కమల్‌హాసన్ లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఇందులో పోస్టర్‌పై ‘వృద్ధుడు.. తెలివైనవాడు.. గట్టివాడు..’ అంటూ క్యాప్షన్‌ ఇవ్వగా, రేపటి నుంచి షూటింగ్‌ ప్రారంభం అంటూ చెప్పుకొచ్చింది. ఖాకీ దుస్తులు ధరించిన సేనాపతి పాత్రలో కమల్‌ లుక్‌ అభిమానులను అలరిస్తోంది. ఈరోజు నుంచి ‘ఇండియన్‌ 2’ సినిమాకు సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనుంది. ఇదే విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో కమల్‌ హాసన్‌కు జోడిగా.. కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సుబాస్కరన్ నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనున్నది.

ఇండియన్2' ఫస్ట్‌లుక్‌
ఇండియన్2' ఫస్ట్‌లుక్‌
Photos: చీరకట్టులో అలరిస్తోన్న అందాల ఈషా రెబ్బా
Published by: Suresh Rachamalla
First published: January 18, 2019, 5:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading