కళ్యాణి ప్రియదర్శన్.. ఈ పేరు గుర్తుందా..? ఒకవేళ గుర్తు లేకపోతే ఒక్కసారి 2017 డిసెంబర్‌కు వెళ్ళి ఆ సమయంలో వచ్చిన "హలో" సినిమా గుర్తు చేసుకోండి. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి వరకు కెమెరా వెనక మాయ చేసిన ఈ భామ.. హలోతో కెమెరా ముందుకొచ్చింది. హీరోయిన్గా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కవ్వించింది. ప్రముఖ మళయాల దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అయిన కళ్యాణికి హీరోయిన్ ఛాన్సులు అంత ఈజీగా ఏం రాలేదు.
హలో తర్వాత తెలుగులో సాయిధరమ్ తేజ్ చిత్రలహరితో పాటు సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమాల్లో నటిస్తుంది. ఇక ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ. కొత్త దర్శకుడు ఆర్.కార్తిక్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా.. అందులో కళ్యాణి కూడా ఉంది. మరో హీరోయిన్ గా బ్రూస్లీ బ్యూటీ కృతికర్పంద నటిస్తుంది. మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు.
ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా కళ్యాణి పాత్రకు కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆపేసిన తర్వాత మెల్లగా స్టార్ హీరోయిన్గా మారిపోతుంది ఈ ముద్దుగుమ్మ. మరి తమిళనాట తొలి సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ ఎలాంటి మాయ చేయబోతుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Sharwanand, Tamil Cinema, Telugu Cinema