హోమ్ /వార్తలు /సినిమా /

వేధింపులు తట్టుకోలేక నటించడం మానేశాను : నటి కళ్యాణి..

వేధింపులు తట్టుకోలేక నటించడం మానేశాను : నటి కళ్యాణి..

కళ్యాణి Photo : Twitter

కళ్యాణి Photo : Twitter

సినీ పరిశ్రమలో కొందరు తనను లైంగింకగా వేధించారని ఆ వేధింపుల తట్టుకోలేక నటనకు దూరమయ్యానని చెప్పింది నటి కళ్యాణి.

సినీ పరిశ్రమలో కొందరు తనను లైంగింకగా వేధించారని ఆ వేధింపుల తట్టుకోలేక నటనకు దూరమయ్యానని చెప్పింది నటి కళ్యాణి. తమిళ సినిమాలైన ‘జయం’, ‘అలై తండా వానమ్‌’, ‘ఎస్‌ఎంఎస్‌’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తమిళ నటి కళ్యాణి తెలుగులో కూడా నటించింది. కళ్యాణి తెలుగులో ‘మళ్లీ మళ్లీ’ అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కళ్యాణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే ప్రభుదేవాతో కలిసి ‘అలై తండా వానమ్‌’ చిత్రంలో నటించాను. హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తోన్న సమయంలో కొంతమంది వ్యక్తులు ఫోన్స్ చేస్తూ.. సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెప్పారు. ఆ మాటలతో బాధకలిగి సినీ ఇండస్ట్రీకి దూరమయ్యానని పేర్కోంది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉండడంతో టీవీలో నటించమని అడిగారు. అలా పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపింది. వేధింపులు తట్టుకోలేక సినిమాలను వదిలేస్తే.. ఇక్కడ బుల్లితెరలో కూడా లైంగిక వేధింపులు ఎదుర్కోన్నాను. దాంతో ఇక మొత్తంగా నటనకే దూరమయ్యి.. కుటుంబంతో ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని తెలిపింది.

First published:

Tags: Tamil Film News, Tollywood Movie News

ఉత్తమ కథలు