ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నపుడు అందరూ అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటాడని ఊహించుకున్నారు. అప్పట్లో తాతతో జూనియర్‌కు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. చివరి రోజుల్లో కొన్నాళ్లు తాతయ్యతోనే ఉన్నాడు జూనియర్. అలాంటి యంగ్ టైగర్ కచ్చితంగా అన్నగారి బయోపిక్‌లో ఉంటాడని ఊహించారు అభిమానులు. కానీ అందులో ఎన్టీఆర్ లేడని.. అతడికి ఎలాంటి పాత్ర లేదని తెలిసిన తర్వాత కాస్త నిరాశ పడ్డారు కూడా. ఇప్పుడు ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.
ఎన్టీఆర్ బయోపిక్‌లో జూనియర్ లేడని తెలిసినపుడు ఫ్యాన్స్ బాధ పడిన మాట వాస్తవమే కానీ అందులో ఆయన లేకపోవడానికి బలమైన కారణమే ఉందన్నాడు కళ్యాణ్ రామ్. అందులో ఎలాంటి విబేధాలు లేవని.. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య వివాదాల కారణంగా జూనియర్‌ను సినిమాలో తీసుకోలేదనే వార్తలు బయట వినిపిస్తున్నాయి కానీ అందులో ఎలాంటి నిజాలు లేవని క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఆడియో వేడుకకు కేవలం బాబాయ్ పిలిచినందుకే తమ్ముడు వచ్చాడని క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో జూనియర్ లేకపోవడానికి అసలు కారణం అందులో అతడికి తగ్గ పాత్ర లేకపోవడమే అని చెప్పాడు ఈ నందమూరి వారసుడు. జూనియర్ ఇప్పుడు స్టార్ హీరో.. తనను చిన్న పాత్రకు పరిమితం చేస్తే కచ్చితంగా అభిమానులు ఫీల్ అవుతారు. అందుకే ఈ బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్ లేడు అంతేకానీ అతన్ని అవమానించడానికో.. మరేదైనా విబేధాలున్నాయనేది మాత్రం అస్సలు కారణం కాదు అని చెప్పాడు కళ్యాణ్ రామ్. జనవరి 9న ‘కథానాయకుడు’.. ఫిబ్రవరి 7న ‘మహానాయకుడు’ విడుదల కానున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ కరిష్మా శర్మ హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Jr ntr, Kalyan Ram Nandamuri, NTR Biopic, Telugu Cinema