హోమ్ /వార్తలు /సినిమా /

కళ్యాణ్ రామ్@118: నంబర్ గేమ్‌పై నందమూరి హీరో హోప్స్

కళ్యాణ్ రామ్@118: నంబర్ గేమ్‌పై నందమూరి హీరో హోప్స్

కళ్యాణ్ రామ్ 118

కళ్యాణ్ రామ్ 118

‘పటాస్’ తర్వాత కళ్యాణ్ రామ్ హిట్టు చూసి చాలా యేళ్లే అవుతోంది. ఐనా సినిమాల విషయంలో మనోడి జోరు ఏ మాత్రం తగ్గలేదు.ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ప్ర‌భావం ప‌డ‌లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి ‘118’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు.

ఇంకా చదవండి ...

‘పటాస్’ తర్వాత కళ్యాణ్ రామ్ హిట్టు చూసి చాలా యేళ్లే అవుతోంది. ఐనా సినిమాల విషయంలో మనోడి జోరు ఏ మాత్రం తగ్గలేదు.ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ప్ర‌భావం ప‌డ‌లేదు. ఈ మ‌ధ్యే త‌మ‌న్నాతో క‌లిసి న‌టించిన "నా నువ్వే".. కాజ‌ల్‌తో "ఎమ్మెల్యే" మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. తాజాగా కళ్యాణ్ రామ్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి ‘118’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు.

అంతేకాదు ‘118’తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్‌లో కళ్యాణ్ రామ్ 8 అంకెలో ఉన్న ఫోటో చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ‘118’ అనే టైటిల్ వెనక ఉన్న రహస్యం ఏంటో చూడాలి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ఫై మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈయ‌నే "నా నువ్వే" సినిమాను కూడా నిర్మించాడు. ఇప్పుడు మ‌రోసారి క‌ళ్యాణ్ రామ్‌తో ‘118’ సినిమాను నిర్మిస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ గుహన్ మూవీ పోస్టర్

గత కొన్నేళ్లుగా అంకెలు సినిమా టైటిల్స్‌గా మారడం ట్రెండ్ అయిపోయింది. రజినీకాంత్ ‘2.O’, సూర్య ‘24’, సిద్దార్థ్ ‘180’, మహేశ్ బాబు ‘వన్’ తో పాటు చాలా సినిమా టైటిల్స్‌లో నెంబర్‌తో ఎండ్ అవడం అనే ట్రెండ్ కూడా ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమాను జవనరిలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

నా నువ్వే పోస్టర్

ఆల్రెడీ జనవరిలో సంక్రాంతికి బాలయ్య..‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీతో పాటు రామ్ చరణ్..‘వినయ విధేయ రామ’..వెంకటేశ్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్2’ సెట్ అయివున్నాయి. మరోవైపు అఖిల్..‘మిస్టర్ మజ్ను’ కూడా జనవరిలోనే లక్‌ను పరీక్షించుకోనున్నాడు. మొత్తానికి ఇంత మంది పెద్ద హీరోల మధ్య కళ్యాణ్ రామ్..జనవరిలో ఏ వారంలో థియేటర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడో చూడాలి. ఇప్పటి వరకు కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ దెబ్బలు తింటూ వచ్చిన కళ్యాణ్ రామ్...ఇపుడు వెరైటీ టైటిల్ ‘118’తోనైనా హీరోగా సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఇది కూడా చదవండి

మెగా కంపౌండ్‌లోకి వెళ్తున్న హరీష్ శంకర్.. బాబు బాగా బిజీ..

మోహన్ లాల్ తెలుగు ఇండస్ట్రీపై సీరియస్‌గా కన్నేసాడే..

అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’.. రవితేజ ‘ముగ్గురమ్మాయిలతో’..

First published:

Tags: Kalyan Ram Nandamuri, Tollywood