అవును రామ్ చరణ్ దర్శకుడితో కళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని కళ్యాణ్ రామ్.. తాజాగా ‘118’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈ నందమూరి హీరో..రామ్ చరణ్‌కు ‘రచ్చ’ వంటి సూపర్ హిట్ అందించిన సంపత్ నంది దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవతున్నట్టు సమాచారం. ఇప్పటికే సంపత్ నంది..కళ్యాణ్ రామ్ ఇమేజ్‌కు తగ్గ స్టోరీ రెడీ చేసి కళ్యాణ్ రామ్‌తో ఓకే చేయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడడమే తరువాయి. ఈసినిమా కూడా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ కథ అని చెబుతున్నారు. ‘గౌతమ్ నందా’ తర్వాత కాస్తంత గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇపుడు కళ్యాణ్ రామ్‌తో చేయబోతున్న సినిమాతో మరోసారి దర్శకుడిగా సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.
కళ్యాణ్ రామ్,సంపత్ నంది
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.