Home /News /movies /

KALYAN RAM NANDAMURI RESPOND ON NTR UNIVERSITY NAME CHANGE ISSUE TA

Kalyan Ram : NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కళ్యాణ్ రామ్ స్పందన ఇది..

కళ్యాణ్ రామ్ నందమూరి  (Kalyan Ram/ Photo Twitter)

కళ్యాణ్ రామ్ నందమూరి (Kalyan Ram/ Photo Twitter)

Kalyan Ram Nandamuri | ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద రగడే నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్ఆర్ పేరు పెట్టడంపై అధికార వైసీపీకి టీడీపీ సహా విపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన, వామ పక్షాలు కూడా జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే హెల్డె యూనివర్సిటీ పేరు మార్పుపై బాలయ్య, ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా మరో నందమూరి హీరో స్పందించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Kalyan Ram Nandamuri - NTR Health University : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో NTR హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు (Health University Name Changed) అంశం వాడీ వేడీగా నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును.. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడంపై దుమారం రేగుతోంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) సహా.. అందరి నేతలు మండిపడుతున్నారు. ఆందోళనలకు కూడా చేస్తున్నారు. పేరు మార్పుపై కేవలం టీడీపీ నేతలే కాదు.. బీజేపీ (BJP), జనసేన (Janasena), కమ్యూనిస్టు పార్టీ (Communist Party)లు సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిర్ణయాన్ని తూర్పారా పడుతున్నారు. అయితే ఎవరు స్పందించినా లేకున్నా.. నందమూరి కుటుంబ సభ్యుల స్పందన గురించే అందరూ చూస్తారు. ఇప్పటికే ఆ కుటుంబం  ఎమ్మెల్యే, సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్- వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం దురదృష్టకరం అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం తెలుగు జాతిని అవమానించడమే అని మండిపడ్డారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. అటు ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ పేరు మార్చడం వలన NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు. NTR స్థాయిని తగ్గించదు. విశ్వ విద్యాలయనాికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరంటూ ఏపీ ముఖ్య మంత్రి తీరును కడిగిపారేసాడు బుడ్డోడు. తాజాగా మరో నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాల విద్యార్ధులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్ గారు, ఈ మహా విద్యాలయానికి అంకుర్పాణ చేశారు. ఈ వైద్య  ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ది  చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వ విద్యాలయానికీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది.

Jr NTR - YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఎన్టీఆర్ అదిరిపోయే కౌంటర్..

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 యేళ్లుకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించిందన్నారు. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అంటూ తన ఆవేదనను ట్విట్టర్‌లో పంచుకున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kalyan Ram Nandamuri, NTR, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు