బింబిసార ‘ట్రైలర్’ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)
Kalyan Ram As Bimbisara Trailer Glimpse | నందమూరి హీరోల్లో సక్సెస్ ప్లాపులకు సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరో కల్యాణ్‌రామ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఎపుడు విడుదల చేస్తారనేది చెప్పాడు.
Kalyan Ram As Bimbisara Trailer Glimpse | నందమూరి హీరోల్లో సక్సెస్ ప్లాపులకు సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram ). ఇతను హీరోగానే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. తాజాగా ఆయన హీరోగా నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara) . ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది.ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘మగధీర’ లెవల్లో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్టు తెలుస్తోంది. ఈ
సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇక ఆ మధ్య సినిమా టీజర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కనుందని ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. ఎంతమంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్లో ‘ఏ టైమ్ ట్రావెల్ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్లింప్స్ విడుదల చేశారు. ఒక యుద్ధం మీద పడితే.. ఎలా ఉంటుందో మీరు చూస్తారు అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగులు బాగున్నాయి. ఈ సినిమా ట్రైలర్ జూలై 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. జూలై 5న కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగా బర్త్ డే కానుకగా బింబిసార ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.