Home /News /movies /

KALYAN RAM NANDAMURI BIMBISARA MOVIE BIG UPDATE TODAY TA

Kalyan Ram - Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీపై బిగ్ అప్‌డేట్..

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీపై బిగ్‌ అప్టేట్ (Kalyan Ram Bimbisara Photo : Twitter)

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీపై బిగ్‌ అప్టేట్ (Kalyan Ram Bimbisara Photo : Twitter)

Kalyan Ram As Bimbisara - NKR 18 | నంద‌మూరి  హీరోల్లో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌. ఈయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్టేట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    Kalyan Ram As Bimbisara - NKR 18 | నంద‌మూరి  హీరోల్లో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌ (Kalyan Ram ). ఇతను హీరోగానే  కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. తాజాగా ఆయన హీరోగా నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara) .  ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది.ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘మగధీర’ లెవల్లో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్టు తెలుస్తోంది. ఈ

    సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇక ఆ మధ్య సినిమా టీజర్‌ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కనుందని ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. ఎంతమంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న  సినిమా ‘బింబిసార’.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.



    ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్‌‌లో ‘ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్టేడ్ 5.09 ఇవ్వనున్నారు.

    Pakka Commercial Movie Review : ’పక్కా కమర్షియల్’ మూవీ రివ్యూ.. గోపీచంద్ హిట్ అందుకున్నాడా..

    ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bimbisara Movie, Kalyan ram, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు