హోమ్ /వార్తలు /సినిమా /

Kalyan Ram | Amigos : కళ్యాణ్ రామ్ అమిగోస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. బిజినెస్ డీటెల్స్..

Kalyan Ram | Amigos : కళ్యాణ్ రామ్ అమిగోస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. బిజినెస్ డీటెల్స్..

Amigos Photo : Twitter

Amigos Photo : Twitter

Kalyan Ram Nandamuri | Amigos : కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో పలకరించనున్నారు. మంచి అంచనాల నడుమ ఈ చిత్రం ఫిబ్రవరి 10న భారీగా విడుదలవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Kalyan Ram | Amigos : కళ్యాణ్ రామ్ (Kalyan Ram Amigos) ఆ మధ్య బింబిసార(Bimbisara)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన అమిగోస్ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.  ఫిబ్రవరి 10న (Kalyan Ram Amigos Release date ) గ్రాండ్‌గా విడుదలవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ బిజినెస్ (Kalyan Ram Amigos Bussiness details ) విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ గత సినిమా బింబిసార 15.60 కోట్ల బిజినెస్‌ను చేసి.. టోటల్ రన్‌లో 37.92 కోట్ల రేంజ్‌లో షేర్‌ని సొంతం చేసుకుని అదరగొట్టింది. ఇక ఆయన నటిస్తున్న అమిగోస్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా 11.30 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏరియాల వారిగా బిజినెస్ డీటేల్స్ చూస్తే.. నైజాం 3.8 కోట్లు, సీడెడ్ 1.1 కోట్లు, ఆంధ్ర 4.2 కోట్లు, ఆంధ్ర తెలంగాణ మొత్తంగా 9.10 కోట్లు, కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.80 కోట్లు, ఓవర్సీస్ 1.40 కోట్లు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 11.30 కోట్లు చేసింది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలంటే 12 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

ఇక  తాజాగా  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి అయ్యాయి (Kalyan Ram Amigos censor). ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. రన్ టైమ్‌ విషయానికి వస్తే.. ఈ చిత్రం 139 నిమిషాల నిడివి కలిగి ఉంది. కన్నడ భామ అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి  2023లో వస్తోన్న మూడో  చిత్రం. ఇప్పటికే విడుదలైన సినిమాలో మూడు పాత్రలకు సంబంధించిన కళ్యాణ్ రామ్ లుక్స్‌‌తో పాటు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు.  సిద్దార్ధ్ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్ర, మూడో పాత్ర మైఖేల్‌ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. ఇతను తనలాగే ఉండే మరో ఇద్దరినీ వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత అతను వాళ్లను ఏం చేసాడనేదే ‘అమిగోస్’ మూవీ స్టోరీలా ఉంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఈ ఇద్దరిని ఎలా వాడుకొని NIA కళ్లు కప్పాడనేదే ఈ సినిమా ట్రైలర్‌లో చూపించారు.

#Amigos Censor Certificate

Certificated : U/A

Runtime : 2 hours 19 mins pic.twitter.com/6CJxlXVAlz

— Cinema Mania (@ursniresh) February 6, 2023

ఈ సినిమాలో హీరో కమ్ విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. ఇక మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మ్యానరిజం‌ చూపించాడు. రీసెంట్‌గా బింబిసారలో కూడా రెండు విభిన్న పాత్రల్లో అలరించిన ఈ నందమూరి హీరో.. ఇపుడు మరో డిఫరెంట్ పాత్రలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ యెకా యెకా ఫుల్ వీడియో సాంగ్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అంటూ రీమిక్స్ సాంగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

'#Amigos @NANDAMURIKALYAN anna career lo oka milestone movie ga nilichipothundi ' ????@tarak9999 at the #Amigos Pre Release Event❤️‍????

- https://t.co/8be0IeoB0c#AmigosOnFeb10th ????????????@AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial @shreyasgroup pic.twitter.com/dHVIVQF9cD

— Mythri Movie Makers (@MythriOfficial) February 5, 2023

కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో కనిపించని డిఫరెంట్ అవతారంలో కనిపించి సినిమాపై అంచనాలు పెంచేలా చేసాడు.  ఒక పాత్ర  ఎంటర్‌ ప్రెన్యూర్  (యువ పారిశ్రామిక వేత్త).  మంజునాథ్‌ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. మైఖేల్ అనే మూడు పాత్రల్లో మెప్పించారు. కోల్‌కత్తాకు చెందిన మైఖేల్ కమ్ విపిన్ పాత్రలో కళ్యాణ్ పాత్ర ఎలాంటిదో ఈ ట్రైలర్‌లో చూపించారు. డోపెల్‌గాంగర్స్ అంటే ఒకే రకంగా ఉండేవాళ్లు అని అర్ధం. రక్త సంబంధం లేకుండా ఒకే రకంగా ఉండేవాళ్లు అని అర్ధం. ఈ సినిమాలో మనుషులు పోలిన మనుషులు ఎదురు పడితే అరిష్టం అంటూ హీరో అమ్మ చెప్పే  డైలాగ్ బాగుంది. మనం బ్రదర్స్ కాదు.. ఫ్రెండ్స్ కాదు.. కేవలం లుక్ లైక్స్ అంటూ కళ్యాణ్ రామ్ భయానక రసంలో చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇక కళ్యాణ్ రామ్ మరోవైపు నవీన్‌ మేడారం దర్శకత్వంలో డెవిల్‌ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇతను బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు.

First published:

Tags: Amigos Movie, Kalyan ram, Tollywood news

ఉత్తమ కథలు