Sana Khan marriage: రహస్యంగా పెళ్లి చేసుకున్న ‘కత్తి’ లాంటి హీరోయిన్..

Sana Khan marriage: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్ళి బాజాలు బాగానే మోగుతున్నాయి. ఒకటి రెండు అని లెక్క పెట్టుకుంటూ వెళ్లిపోవడమే ఇప్పుడు అభిమానులు చేస్తున్న పని. మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్ కూడా తను ప్రేమించిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2020, 10:58 PM IST
Sana Khan marriage: రహస్యంగా పెళ్లి చేసుకున్న ‘కత్తి’ లాంటి హీరోయిన్..
సనా ఖాన్ పెళ్లి (sana khan marriage)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్ళి బాజాలు బాగానే మోగుతున్నాయి. ఒకటి రెండు అని లెక్క పెట్టుకుంటూ వెళ్లిపోవడమే ఇప్పుడు అభిమానులు చేస్తున్న పని. మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్ కూడా తను ప్రేమించిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ఆమె కంటే ముందు రానా, నితిన్, నిఖిల్, దిల్ రాజు లాంటి వాళ్లు కూడా పెళ్ళి పీటలెక్కారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుంది. కాకపోతే అందరి మాదిరి గ్రాండ్‌గా కాకుండా చాలా సైలెంట్‌గా.. ఓ విధంగా చెప్పాలంటే రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ భామే సనా ఖాన్. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన మిస్టర్ నూకయ్యతో పాటు కళ్యాణ్ రామ్ కత్తి సినిమాల్లో నటించింది. నాగార్జున హీరోగా వచ్చిన గగనంలో కూడా కీలక పాత్రలో నటించింది సనా ఖాన్. ఇప్పుడు ఈ భామ పెళ్లి పీటలెక్కింది. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆమెకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో బాలీవుడ్‌లో కూడా నటించింది. అక్కడ ఏకంగా హాట్ సీన్స్ చేసినా ఫలితం శూన్యం.
sana khan marriage,sana khan marriage video,sana khan nikah,sana khan ki shadi,sana khan husband,sana khan wedding video,sana khan marriage full video,sana khan secret marriage,sana khan marriage with mufti anas,sana khan marriage date,sana khan shadi video,#sana khan merriage videos,sana khan mufti anas,సనా ఖాన్ పెళ్లి,సనా ఖాన్ సీక్రేట్ మ్యారేజ్,కత్తి హీరోయిన్ సనా ఖాన్ పెళ్లి
సనా ఖాన్ పెళ్లి (sana khan marriage)

కెరీర్ డల్‌గా ఉండటంతో ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టింది సనా ఖాన్. 2019 ఫిబ్రవరిలో మెల్విన్ అనే కొరియోగ్రాఫర్తో రిలేషన్ లో ఉన్నట్లుగా ప్రకటించింది సనా. కానీ ఇప్పుడు పెళ్లి మాత్రం మరొకర్ని చేసుకుంది సనా ఖాన్. 2020 ఆరంభంలో అతడికి బ్రేకప్ చెప్పిన సనా.. గుజరాతీ వ్యాపారవేత్త ముఫ్తీ అన్నాస్‌తో ప్రేమలో పడింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. వీళ్ల వివాహం నవంబర్ 21న సూరత్‌లో గుజరాతీ సాంప్రదాయం ప్రకారం జరిగింది. కరోనా కారణంగా కొద్దిమంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించారు. పెళ్ళి తర్వాత సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేలా కనిపిస్తుంది సనా ఖాన్.
Published by: Praveen Kumar Vadla
First published: November 22, 2020, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading