ఎన్టీఆర్‌ని తమ్ముడని పిలవను.. కల్యాణ్ రామ్ కామెంట్స్..

సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కల్యాణ్ రామ్.


Updated: January 16, 2020, 9:00 PM IST
ఎన్టీఆర్‌ని తమ్ముడని పిలవను.. కల్యాణ్ రామ్ కామెంట్స్..
కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
ఈ సంక్రాంతికి టాప్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలు సంక్రాంతి ముందు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక సంక్రాంతి రోజు నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమా విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నాడు కల్యాణ్ రామ్. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కల్యాణ్ రామ్.

తాను ఎన్టీఆర్‌ని తమ్ముడని పిలవనని.. 'నాన్న' అని పిలుస్తానని చెప్పాడు. మొదటి నుంచీ అలా అలవాటయిందని.. అందుకే సినిమా కార్యక్రమాల్లోనూ అలాగే పిలుస్తున్నానని వెల్లడించాడు. ''తారక్ నాతో నాన్నగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడు. అతడిలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే తారక్‌ని తమ్ముడని పిలవను. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నాన్న లేని లోటును తారక్ తీరుస్తున్నాడు.'' అని కల్యాణ్ రామ్ పేర్కొన్నాడు.

కాగా, కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచి వాడవురా సినిమా బుధవారం మకర సంక్రాంతి సందర్భంగా విడుదలయింది. కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. గుజరాతీ సినిమా ఆక్సీజన్‌కు ఇది రీమేక్. గోపి సుందర్ సంగీతం అందించగా.. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా పనిచేశారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు