‘పటాస్’ సినిమా తర్వాత ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్‌కు సరైన హిట్టే లేదు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గతేడాది కూడా తమన్నాతో కలిసి నటించిన నా నువ్వేతో పాటు కాజల్‌తో చేసిన ‘ఎమ్మెల్యే’ సినిమా చేసాడు. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 118 సినిమాలో నటించాడు. ఈ చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకుడిగా మారుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇది చూస్తుంటే కళ్యాణ్ రామ్ తొలిసారి పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. షాలినీ పాండే ఇందులో కళ్యాణ్ రామ్ జోడీగా నటిస్తుంది. ఇక ఆమెతో పాటు నివేదా థామస్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. సాఫీగా సాగిపోతున్న వీళ్ల జీవితంలో అనుకోకుండా 1 గంట 18 నిమిషాలకు జరిగిన ఓ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది కథ. 118 సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించనట్టు కనబడుతోంది. ఈ సినిమా బిజినెస్ కూడా ఊహించని విధంగా జరిగింది. దాదాపు 14 కోట్ల బిజినెస్ జరగడంతో ఇప్పుడు సంతోషంలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉండటంతో సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. జెమిని టీవీ ఇప్పటికే శాటిలైట్ రైట్స్ రూపంలోనే 3.10 కోట్లు ఇచ్చేసింది. డిజిటల్ కూడా బాగానే వచ్చింది. ట్రైలర్లో కనిపించని నిజం కోసం అన్వేషిస్తున్నాడు కళ్యాణ్ రామ్. గతేడాది నా నువ్వే సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ లో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మార్చ్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. కొన్నేళ్లుగా హిట్టన్నదే లేకుండా పోయిన కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kalyan Ram Nandamuri, Shalini Pandey, Telugu Cinema, Tollywood