Home /News /movies /

KALI MOVIE CONTROVERSY DIRECTOR LEENA MANIMEKALAI RELEASED SMOKING KAALI FILM POSTER AND ITS HURTING HINDU SENTIMENTS AND FIR AGAINST MOVIE DIRECTOR TA

Kali Movie Controversy : ‘కాళి’ సినిమా కాంట్రవర్సీ.. అమ్మవారు సిగరెట్ తాగుతున్న పోస్టర్ పై హిందూ సంఘాల మండిపాటు..

కాళి మాత పోస్టర్ పై వివాదం (Twitter/Photo)

కాళి మాత పోస్టర్ పై వివాదం (Twitter/Photo)

Kali Movie Controversy : గత కొంత కాలంగా ఏ సినిమా తీసుకున్న ఏదో ఒక వివాదం సినిమా తీసినవాళ్లను చుట్టుముడుతూనే ఉంది. ఐతే.. తెలియక కొందరు ఇలాంటి తప్పులు చేస్తే.. మరికొందరు కావాలనే తమ సినిమాకు చీఫ్ పబ్లిసిటీ కోసం కొన్ని ప్రయ్నాలు చేస్తుంటారు. తాజాగా కాళి అంటూ ఓ డాక్యుమెంటరీ సినిమా పోస్టర్ తాజాగా వివాదానాకి కేంద్ర బిందువుగా మారింది.

ఇంకా చదవండి ...
    Kali Movie Controversy  గత కొన్నేళ్లుగా చాలా మంది మూవీ మేకర్స్ ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలు.. దర్శకులు తమ సినిమాల్లో కావాలనే కాంట్రవర్సీ చొప్పిస్తున్నారు.  ముఖ్యంగా హిందూ దేవీ దేవతలపై తమ ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తున్నారు. అంతేకాదు తమ సినిమాల్లో ఆయా వేషాలు వేసిన నటీనటులతో చేయకూడని పనులు చేయిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ’కాళి’ పేరుతో తెరకెక్కిస్తోన్న ఓ డాక్యుమెంటరీ సినిమాపై ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తం అవుతున్నాయి. కావాలనే తమ సినిమా హైలెట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే సదరు దర్శక, నిర్మాతలు ఈ పని చేసినట్టు తెలుస్తోంది. తాజాగా  ఈ సినిమాలో కాళి మాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు డైరెక్టర్ లీనా మణిమేకలై. ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి హిందూ సంఘాలు సదురు దర్శకుడి  తీరుపై భగ్గు మంటున్నాయి. ఇదే తరహాలో వేరే మతానికి చెందిన దేవుళ్లపై చిత్రీకరించే దమ్ము, ధైర్యం ఈ దర్శకుడికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

    హిందూ ఎంతో పవిత్రంగా పూజించే అమ్మవారితో సిగరేట్ తాగుతున్న ఫోటోను సినిమా పబ్లిసిటీ కోసం వాడుకోవడం దారుణమంటున్నారు. ఇలాంటి వివాదాస్పద చిత్రాలు తీయడం వెనక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ లీనా పై అనేక రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్స్‌లో ఆమె తీసిన సినిమాకు వ్యతిరేకంగా  ఫిర్యాదులు నమోదు అయ్యాయి.  ముఖ్యంగా అమ్మవారి సిగరెట్ తాగడం.. చేతిలో ఓ వర్గానికి సంబంధించిన జెండా పట్టుకోవడం రెండు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు గాయపర్చిన లీనాను అరెస్ట్ చేయాలని పలు హిందూ సంఘాలు  డిమాండ్ చేస్తున్నాయి.



    ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్ లీనాపై దేశ రాజధాని దిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ సినిమాను సమాన హక్కుల తీసినట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటికే ప్రఖ్యాత కెనడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఇక కాళీ మాత సిగరెట్ తాగుతూ విడుదల చేసిన పోస్టర్ పై  ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు  డైరెక్టర్ లీనా. పైగా ఈ సినిమాను రాజ్యాంగం మనకు కల్పించిన ఆర్టికల్ 19(1) A వాక్ స్వాతంత్య్రం కోసం  ప్రాణాలు విడవడానికి రెడీ అంటూ తాను రిలీజ్ చేసిన పోస్టర్ పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నట్టు తెలిపారు. మొత్తంగా  లీనా తీరుపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తంగా ట్విట్టర్‌లో లీనా మణిమేకలై అరెస్ట్ వార్త  ప్రస్తుతం ట్రెండ్  అవుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు