‘కళంక్’ మూవీ ట్రైలర్... రెండు మతాలు, రెండు జంటలు... ఓ ప్రేమ సంఘర్షణ...

సినిమాపై ఆసక్తి పెంచేస్తున్న ట్రైలర్... ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ‘కళంక్’...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 4, 2019, 6:12 PM IST
‘కళంక్’ మూవీ ట్రైలర్... రెండు మతాలు, రెండు జంటలు... ఓ ప్రేమ సంఘర్షణ...
‘కలంక్’ మూవీ ట్రైలర్... రెండు మతాలు, రెండు జంటలు... ఓ ప్రేమ సంఘర్షణ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 4, 2019, 6:12 PM IST
ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పుడుతుందో చెప్పలేం... పురాణాల దగ్గర్నుంచి, నేటి దాకా ఏ ప్రేమకథ తీసుకున్నా... చెప్పుకోవడానికి కొత్తగా కథ ఏమీలేకపోయినా... ఆ ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఒకటిగా భావిస్తున్న ‘కళంక్’ సినిమా స్టోరీ కూడా ఇదే. టీజర్‌లో స్క్రీన్ మొత్తం రంగుల్లో నింపేసి, భారీ హంగులను చూపించిన దర్శకుడు అభిషేక్ వర్మన్... తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ఎమోషన్‌నే హైలెట్ అయ్యేలా చూసుకున్నాడు. స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో రాచరికం రాజ్యమేలుతున్నప్పుడు రెండు మతాలు, రెండు జంటల మధ్య జరిగిన ప్రేమ సంఘర్షణే ‘కళంక్’. ప్రియుడితో వెళ్లిపోవాలని రైలు ఎక్కేసింది యువరాణి రూప్. అతను వచ్చేలోపు రైలు బయలుదేరుతుంది. అప్పుడే పరుగెత్తుకుంటూ వస్తున్న ప్రియుడికి చెయ్యి అందిస్తుంది. ఆ సమయంలో ఆమె పట్టుతప్పి పడిపోకుండా చెయ్యి ఒడిసి పట్టుకున్నాడు ఆమె భర్త. ఈ ఒక్కసీన్ చాలు సినిమాలో దర్శకుడు ఏం చెప్పబోతున్నాడో చెప్పడానికి! ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ యువరాణి, ఆమెను ప్రాణంగా ప్రేమించే ఓ ముస్లిం యువకుడు, భార్య ప్రేమను ఎలా పొందాలో తెలియక సతమతపడే యువరాజు. భర్త ప్రేమను ఎలా దక్కించుకోవాలో తెలియని ఓ రాణి. ఈ నలుగురి మధ్య సాగే ప్రేమ సంఘర్షణే ‘కళంక్’.
kalank, kalank trailer, kalank movie trailer, Varun dhawan, bollywood movie trailers, Alia bhatt, sonakshi Sinha, madhuri dixit, Abhishek Varman, karan johar films, kalank movie trailer , aditya roy kapur, sanjay dutt, కలంక్, కళంక్, కళంక్ ట్రైలర్, కలంక్ మూవీ ట్రైలర్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, అలియా భట్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, బాలీవుడ్ మూవీ
‘జల్లికట్టు’ సీన్‌ను ప్రతిబింబించే ఎద్దు పోరాట దృశ్యం ‘కళంక్’ ట్రైలర్‌కే హైలెట్


కరణ్ జోహర్, సాజిద్ నదియావాలా, యశ్ జోహార్, అపూర్వ మెహాతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఆలియా భట్, మాధురి దీక్షిత్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హి, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, కృనాల్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ధావన్ ఓ ఎద్దుతో పోరాడే సీన్స్ ‘బాహుబలి’ చిత్రాన్ని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. ప్రతీ సినిమాకు నటిగా తనను తాను మెరుగుపర్చుకుంటున్న ఆలియా భట్... మరోసారి నటనతో అదరగొట్టేసిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కైరా అద్వాణీ, కృతి సనన్ అతిథి పాత్రల్లో నటించిన ‘కళంక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

‘కళంక్’ ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...