హిందీ స్టార్ కపుల్ అజయ్ దేవ్‌గణ్, కాజోల్ కలిసి తాజాగా నటించిన చిత్రం 'తానాజీ'. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ సినిమాలో కాజోల్ తన భర్త అజయ్ దేవ్గన్తో చాలా రోజుల తర్వాత కలిసి నటించింది. ఈ సినిమాను అజయ్ దేవగన్ నిర్మిస్తూ.. సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. మిగితా పాత్రల్లో సైఫ్ అలీ ఖాన్, కాజోల్, శరద్ కేల్కర్, జగపతిబాబు, శశాంక్ షిండే, నేహా శర్మ నటించారు. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా కాజోల్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి కొన్ని ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తనకు పెళ్లికి ముందు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడని, కొంత కాలం అతనితో స్నేహం చేశానని చెప్పింది. అంతేకాదు ఈ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి తన భర్త అజయ్‌కు కూడా తెలియజేశానని పేర్కోంది. 'అజయ్‌తో పరిచయానికి ముందే నాకొక బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. కానీ, అతనితో ఎక్కువ రోజులు స్నేహం చేయలేదు. కారణం కొన్ని విషయాల్లో మా మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయం గురించి అజయ్‌కు చెప్పాను. ఆ తర్వాత నేను, అజయ్ నాలుగేళ్లు డేటింగ్ చేశాం. ఆ తర్వాతే మేం పెళ్లి చేసుకున్నాం అని కాజోల్ పేర్కోంది. కాజల్ హాట్ పిక్స్..
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.