news18-telugu
Updated: November 25, 2020, 7:46 AM IST
కాజల్ Photo : Instagram
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత పూజలు పురస్కారాలు నిర్వహించిన కాజల్ భర్తతో కలిసి హనీమూన్‌కి వెళ్లింది. భర్త గౌతమ్‌తో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇక అక్కడ తాను తన భర్తతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ దానికి సంబందించిన కొన్ని పిక్స్‌ను షేర్ చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కాజల్ మరో రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది. సముద్రం మధ్యలో డిన్నర్ చేస్తూ.. బికినీలో సూపర్ రొమాంటిక్‌గా ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో కాజల్ స్ట్రాబెర్రి తింటూ ఇచ్చిన ఫోజు మామూలుగా లేదు. దీంతో ఈ ఫోటోపై తెగ కామెంట్స్ వస్తున్నాయి. ఇక గౌతమ్‌తో పెళ్లికి ఒప్పుకోవడానికి ఓ రీజన్ ఉందని చెప్పింది కాజల్.. అదేంటంటే.. అందరు అమ్మాయిల్లానే.. తనకు కాబోయేవాడు మోకాళ్లపై నిలిచి ఎర్రని గులాబి అందించి తన ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుందట. ఇక కాజల్ ఎలా అయితే ఆశపడిందో.. ఆ విధంగానే గౌతమ్ కిచ్లు తనకు ప్రపోజ్ చేశాడట. దీంతో కాజల్ గౌతమ్‌తో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఒకవేళ అలా చేయకపోతే అతడితో పెళ్లి కష్టమే అని సరాదాగా కామెంట్ చేసింది. ప్రతి అమ్మాయికి అలా తాను పెళ్లి చేసుకోబోయేవాడితో రాజా పూవ్వు అందుకోవాలని కోరుకుంటుందని చెబుతోంది కాజల్. గౌతమ్ ముందే తన పేరెంట్స్ తో మాట్లాడి సంబంధం పెళ్లి ఫిక్స్ చేసేసుకున్నాడని అయినా కానీ తనకు మోకాళ్ల ఉండి ప్రపోజ్ చేయాలని రూల్ పెట్టానని కూడా కాజల్ చెప్పింది. ఓ మంచి లవ్ ఫీల్ తర్వాతనే పెళ్లి ఎంతో మధురంగా ఉంటుందని అంటోంది కాజల్.
ఇక అది అలా ఉంటే ఈ భామ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న కాజల్.. ఆచార్య షూటింగ్లో డిసెంబర్ 5న జాయిన్ కానున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో కొన్ని రోజులు భర్తకు బైబై చెప్పి హైదరాబాద్‌లో జరుగుతోన్న ఆచార్య షూటింగ్లో పాల్గొననుంది. ప్రస్తుతం సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఓ ఆర్నెల్లు వాయిదా పడింది. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్లో సడలింపులు ఇవ్వడంతో మళ్లి మొదలైంది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే... డైరెక్టర్ తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు సినిమాలకు పరిచయమైనా... క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఇక అప్పటినుండి.. వెనుకకు చూసింది లేదు కాజల్. తెలుగువారిని తన అందచందాలతో, ఎవరని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. తెలుగులో దాదాపు అందరీ హీరోలతో నటించింది ఈ చందమామ. అంతేకాకుండా స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కాజల్ ప్రస్తుతం ‘ముంబై సాగా అనే హిందీ సినిమాలో నటిస్తుండగా.. మరోవైపు కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Published by:
Suresh Rachamalla
First published:
November 25, 2020, 7:41 AM IST