Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ముహూర్తం ఫిక్స్‌..

Kajal Aggarwal | ఎంతో కాలంగా కాజల్ అగర్వాల్ అభిమానులు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. అంతేకాదు దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. దీంతో చందమామ అభిమానులు ఆ ఆనంద క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 4, 2020, 3:36 PM IST
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ముహూర్తం ఫిక్స్‌..
కాజల్ అగర్వాల్ (Twitter/Photo)
  • Share this:
ఎంతో కాలంగా కాజల్ అగర్వాల్ అభిమానులు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. అంతేకాదు దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. దీంతో చందమామ అభిమానులు ఆ ఆనంద క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్‌లో కొలువుతీరనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కాజల్ అగర్వాల్ కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం రెడీ అయింది. అంతేకాదు రేపు అనగా ఈ బుధవారం ఈమె మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాజల్ అగర్వాల్ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది.

మన దక్షిణాది విషయానికొస్తే.. తొలిసారిగా ప్రభాస్.. ఈ మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌లో రీసెంట్‌గానే పెట్టారు. తాజాగా సౌత్ నుంచి మూడో వ్యక్తిగా కాజల్ అగర్వాల్ ఈ మ్యూజియంలో బొమ్మగా కొలువు తీరనుంది.  ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. ప్యారిస్ ప్యారిస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు ఆమె ముంబాయి సాగా, ‘ఇండియన్ 2’ మోసగాళ్లు వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు