మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువైన కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal Madame Tussauds | ఎంతో కాలంగా కాజల్ అగర్వాల్ అభిమానులు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. తెలుగు తెర అందాల చందమామ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 5, 2020, 9:26 AM IST
మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువైన కాజల్ అగర్వాల్..
మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన కాజల్ అగర్వాల్ (Instagram/Photo)
  • Share this:
ఎంతో కాలంగా కాజల్ అగర్వాల్ అభిమానులు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. తెలుగు తెర అందాల చందమామ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్‌లో కాసేపటి క్రితమే కొలువు తీరింది. ఈ  కాజల్ మైనపు బొమ్మను తయారు చేయడానికి మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు కాజల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ మైనపు విగ్రహాన్ని కాజల్ అగర్వాల్..తన చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి ఆవిష్కరించింది. కాజల్ అగర్వాల్.. మిక్స్‌డ్ కలర్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 

View this post on Instagram
 

Another one of u is finally year. It took a year and she is here! Hahahah @kajalaggarwalofficial #doubletrouble #kajalaggarwal #madametussauds #madamtussaudssingapore #mtsg


A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on

సౌత్  విషయానికొస్తే.. తొలిసారిగా ప్రభాస్.. మేడమ్ టుస్సాడ్స్‌కు సంబంధించిన మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌లో రీసెంట్‌గానే పెట్టారు. తాజాగా సౌత్ నుంచి మూడో వ్యక్తిగా కాజల్ అగర్వాల్ ఈ మ్యూజియంలో బొమ్మగా కొలువు తీరింది.  ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. ప్యారిస్ ప్యారిస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు ఆమె ముంబాయి సాగా, ‘ఇండియన్ 2’ మోసగాళ్లు వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు