కాజల్ అగర్వాల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. సౌత్‌లో ఫస్ట్ హీరోయిన్‌గా గుర్తింపు..

దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు దక్కించుకుంది.

news18-telugu
Updated: December 17, 2019, 11:38 AM IST
కాజల్ అగర్వాల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. సౌత్‌లో ఫస్ట్ హీరోయిన్‌గా గుర్తింపు..
కాజల్ అగర్వాల్ (Twitter/Photo)
  • Share this:
దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ శాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు. కాజల్ ఉత్తరాదికి చెందిన అమ్మాయి అయిన దక్షిణాది సినిమాలతోనే పాపులర్ అయింది. ఈ రకంగా మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరనున్న తొలి సౌతిండియా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది.

kajal aggarwal wax statue at madame tussauds singapore she becomes the first south indian actress,kajal aggarwal,kajal aggarwal madame tussauds,madame tussauds wax statue,kajal aggarwal instagram,kajal aggarwal twitter,kajal aggarwal facebook,prabhas madame tussauds,mahesh babu wax statue at madame tussauds,kajal aggarwal,mahesh babu about madame tussauds,madame tussauds london,kajal aggarwal wax statue in madame tussauds singapore,kajal aggarwal wax statue at madame tussauds singapore,kajol wax statue in madame tussad,kapil sharma's wax statue at madame tussauds,mahesh babu,madame tussauds kapil sharma,kajal aggarwal mobile app,tollywood,kollywood,bollywood,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం,కాజల్ అగర్వాల్ మేడమ్ టుస్సాడ్స్,మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన కాజల్ అగర్వాల్
మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువు తీరనున్న కాజల్ అగర్వాల్ (Twitter/Photo)


మన దక్షిణాది విషయానికొస్తే.. తొలిసారిగా ప్రభాస్.. ఈ మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌లో రీసెంట్‌గానే పెట్టారు. తాజాగా సౌత్ నుంచి మూడో వ్యక్తిగా కాజల్ అగర్వాల్ ఈ మ్యూజియంలో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. ప్యారిస్ ప్యారిస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. మరోవైపు ఆమె ముంబాయి సాగా, ‘ఇండియన్ 2’ మోసగాళ్లు వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు