కాజల్ అగర్వాల్ కరోనా టైమ్‌లో కూడా ఖాళీ లేదండోయ్..

Kajal Aggarwal: ఇంట్లో ఉండాలంటే కాస్త కష్టమే కానీ మన కోసమే కదా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 20, 2020, 6:25 PM IST
కాజల్ అగర్వాల్ కరోనా టైమ్‌లో కూడా ఖాళీ లేదండోయ్..
ఈ సినిమాను తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా విడుదల కాలేదు. పాన్ ఇండియన్ సినిమాగా అరణ్య వస్తుంది. తమిళనాట దీన్ని కాండన్‌గా.. హిందీలో హాథీ మేరీ సాథీగా విడుదల చేస్తున్నారు.
  • Share this:
ఎప్పుడూ సినిమాలతో.. షూటింగ్స్‌తో బిజీగా ఉండే హీరోయిన్లకు ఒక్కసారిగా లాక్ డౌన్ కావడంతో బోర్ కొట్టేస్తుంది. ఇంట్లో ఉండాలంటే కాస్త కష్టమే కానీ మన కోసమే కదా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే చేసింది. అయితే ఈమె ఖాళీ సమయాన్ని ఖాళీగా అస్సలు వదిలేయడం లేదు. అసలే కష్టపడిన ప్రాణం కదా అందుకే టైమ్ ఊరికే అలా వేస్ట్ అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను అంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈ ఫ్రీ టైమ్ తన కోసం వాడుకుంటుంది. కొత్తగా ఏదైనా చేయాలని ఉందంటూ చెబుతుంది కాజల్.

కాజల్ అగర్వాల్ (Instagram/Photo)
కాజల్ అగర్వాల్ (Instagram/Photo)


ఇందులో భాగంగానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు వెల్లడించింది కాజల్. ప్రస్తుతం కరోనా కారణంగా బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి వచ్చింది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అందుకే అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని వృథా చేయకుండా మార్షల్ ఆర్ట్స్ వైపు పరుగులు తీస్తున్నట్లు చెప్పింది కాజల్. ఎప్పుడు తనకు ఖాళీ టైమ్ దొరికినా కూడా ఇలా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటానని చెప్పింది ఈమె.

కాజల్ అగర్వాల్ (Instagram/Photo)
కాజల్ అగర్వాల్ (Instagram/Photo)


అలా నేర్చుకున్నది జీవితంలో ఎంత వరకూ ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని చెబుతుంది. అప్పుడు నేర్చుకోవాలి.. మనసుకు నచ్చింది కాబట్టి అయిపోవాలంతే అంటుంది కాజల్. మనసుకి నచ్చిన పనులను చేస్తూ వెళ్తానని.. అలా సంతోషం వస్తుందని చెబుతుంది కాజల్. ఇదిలా ఉంటే మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ కూడా మొదలు పెట్టానని చెప్పింది కాజల్. వీలైనంత త్వరగా దీనిపై పట్టు సాధిస్తానంటుంది. అన్నట్లు ప్రస్తుతం తమిళంలో భారతీయుడు 2.. తెలుగులో చిరంజీవి ఆచార్య సినిమాల్లో నటిస్తుంది కాజల్.
Published by: Praveen Kumar Vadla
First published: May 20, 2020, 6:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading