Kajal Aggarwal : కాజల్ పెళ్లి ఫిక్స్.. వరుడు అతనేనట..

Kajal Aggarwal : ఇటీవలే 35వ పుట్టినరోజును జరుపుకున్న కాజల్ పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: June 23, 2020, 1:38 PM IST
Kajal Aggarwal :  కాజల్ పెళ్లి ఫిక్స్.. వరుడు అతనేనట..
కాజల్ Photo : Twitter
  • Share this:
కాజల్ అగర్వాల్.. ఈ అందాల మెరుపుతీగను తెలుగుతెరకు తేజ పరిచయం చేసినా.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇక అప్పటినుండి తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. 15 ఏళ్ల క్రితం సినిమా రంగంలోకి అడుగు పెట్టిన కాజల్ ఇప్పటికీ బిజీగా చేతి నిండా సినిమాలతో ముందుకు సాగుతోంది. అయితే ఆమె చెల్లెలు నిషా పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ కాజల్ మాత్రం తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టింది. ఇటీవలే 35వ పుట్టినరోజును జరుపుకున్న కాజల్ పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా కాజల్ త్వరలో పెళ్లి చేసుకోనుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఔరంగాబాద్‌కి చెందిన ఓ వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు వర్గాల కుటుంబసభ్యులు మాట్లాడుకున్నారని, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవి 'ఆచార్య', మంచు విష్ణు 'మోసగాళ్లు' చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో శంకర్ దర్శకత్వంలో వస్తోన్న 'ఇండియన్ 2' లో.. అలాగే హిందీలో 'ముంబయి సాగ'లో కాజల్ నటిస్తోంది. వీటికి తోడు తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్నఓ వెబ్ సిరీస్‌లోనూ కాజల్ నటిస్తోంది.
First published: June 23, 2020, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading