కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ కార్యం..

కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

news18-telugu
Updated: February 1, 2020, 10:25 PM IST
కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ కార్యం..
Twitter
  • Share this:
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాల్లో కాజల్ కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైనా  కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో  ఇక అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ తెలుగువారిని తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది.  అది అలా ఉంటే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మంచి హ్యాపీ మూడ్‌లో ఉంది. కారణం ప్రఖ్యాత సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె విగ్రహం ఏర్పాటు చేయడమే. కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చింది. ఈనెల 5వ తేదీన ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు మ్యూజియం అధికారులు. దీనికి ఇంకా కేవలం కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది. దీంతో కాజల్ తెగ సంబరపడిపోతోంది.

Twitter


కాగా ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు చిత్రసీమకు సంబందించి మహేష్ బాబు, ప్రభాస్ వంటి నటుల విగ్రహాలు కోలువుదీరాయి. ఈ విగ్రహాలతో పాటు హిందీ చిత్ర సీమ నుండి అమితాబ్, హృతిక్ రోషన్ , కాజోల్, కరీనా కపూర్ వంటి అనేక మంది నటీ నటుల మైనపు విగ్రహాలు అక్కడ ఉన్నాయి. కాగా ఈ లిస్ట్‌లో అందాల చందమామ కాజల్ చేరనుంది. కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లో కూడా కాజల్ నటిస్తోంది.

First published: February 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు