కాజల్ అగర్వాల్.. తెలుగు సినిమాల్లో గత 10 సంవత్సరాలుగా నటిస్తూ తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. దర్శకుడు తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైనా కాజల్.. కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారి మనుసుల్నీ దోచుకుంది. కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఇండస్ట్రీలో కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ సొంత అభిమానుల్ని సంపాదించుకుంది అందాల కాజల్. అయితే ఒకప్పుడు కేవలం స్టార్ హీరోల సినిమాలతోనే బిజీగా గడిపిన కాజల్ అగర్వాల్ ఈమధ్య పెద్ద హీరోల చిత్రాలతో పాటు మీడియమ్, చిన్న హీరోల సినిమాలకు సై అంటోంది. అందులో భాగంగా కాజల్ ఇటీవల శర్వానంద్ ‘రణరంగం’లో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి యువ హీరో శ్రీవిష్ణుతో ఓ సినిమాను చేయడానకిి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా కాజల్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబీనేషన్‌లో వస్తున్న భారతీయుడు 2 నటిస్తోంది.
తమన్నా హాట్ ఫోటోస్..
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.