తన అందాలతో అభిమానుల మనసుల్ని దోచుకుంది కాజల్ అగర్వాల్, ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టుల ద్వారాకూడ తన అభిమానులతో తన అనుబంధాన్ని కూడా పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో చలాకీగా వుండే ఈ బ్యూటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేక పోవడం భాదగా ఉందంటూ తన భాదను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. కాజల్ కి రాజకీయాల్లో కూడా ఫాలోయింగ్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. మోదీని కూడా పడేశావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. విషయం ఏంటంటే, భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా.
Dear sir @narendramodi @PMOIndia @rashtrapatibhvn thank you so much for your kind invite. Feeling privileged and honoured upon receiving this, would have loved to witness history in the making! pic.twitter.com/NIf76QPCGw
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 30, 2019
ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దేశంలోని వివిధ రాజకీయ పక్షాలతో పాటు సినీ,క్రీడా, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందాయి. చాలా మంది రాష్ట్రపతి భవన్‌లో ఈ వేడుకలో ఎంతో ఉత్సాహాంగా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్మో,.. నరేంద్ర మోదీతో రాష్ట్రపతి ప్రాంగణంలో ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ వేడుకకు వెళ్లలేకపోయినందుకు బాధ పడుతున్నానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.పీఎంవో ఆఫీస్ నుండి తనకు వచ్చిన ఇన్విటేషన్ ని పోస్ట్ చేసిన ఆమె.. ఈ ఆహ్వానం తనకు చాల లేటుగా అందిందన్నారు. అందుకే వెళ్లలేకపోయానంటూ పశ్చాతాపం వ్యక్తం చేసింది. మొత్తానికి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చారిత్రక ఘట్టానికి హాజరు కాకపోవడం చాలా బాధగా ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Kajal Aggarwal, Lok sabha election results, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi