చిరంజీవిని వెంటాడుతున్న హీరోయిన్ కష్టాలు.. నిన్న త్రిష..నేడు కాజల్..

ఏ ముహూర్తానా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో.. ఈ సినిమాకు అడుగుడున గండాలు ఎదురువుతున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా బ్రేకులు పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ గుడ్ బై చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: May 2, 2020, 1:46 PM IST
చిరంజీవిని వెంటాడుతున్న హీరోయిన్ కష్టాలు.. నిన్న త్రిష..నేడు కాజల్..
చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన త్రిష,కాజల్ (Twitter/Photo)
  • Share this:
ఏ ముహూర్తానా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో.. ఈ సినిమాకు అడుగుడున గండాలు ఎదురువుతున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. సామాజిక కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నక్సలైట్‌ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో చిరు సరసన  ముందుగా హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు. వీళ్లిద్దరిపై ఒకటి రెండు సన్నివేశాలు తెరకెక్కించారు.కానీ  క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా త్రిష ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

Kajal aggarwal skip Megastar Chiranjeevi acharaya movie due to these reasons,chiranjeevi,kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal confirmed to act chiranjeevi acharya movie,chiranjeevi kajal aggarwal,kajal aggarwal romance to chiranjeevi koratala siva,acharya update, kajal in chiranjeevi film, kajal replaces trisha for Acharaya,regina song in Acharya,రెజీనా, ఆచార్య,రెజీనా సాంగ్, chiranjeevi,chiranjeevi movies,Chiranjeevi,Trisha Khrishnan,Trisha Khrishnan walks out from chiranjeevi movie,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి త్రిష,చిరంజీవి సినిమా నుంచి త్రిష ఔట్,త్రిష చిరంజీవి కొరటాల శివ,త్రిష కృష్ణన్,కాజల్,kajal in Aacharya,kajal in acharya,ఆచార్యలో కాజల్,చిరంజీవి,చిరంజీవి కాజల్ అగర్వాల్,చిరంజీవి ఆచార్యలో నటిస్తున్నట్టు ప్రకటించిన కాజల్ అగర్వాల్
చిరంజీవి,త్రిష (File/Photo)


ఆ తర్వాత ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసారు. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ కూడా అఫీషియల్‌గా ప్రకటించింది. నెక్ట్స్ షెడ్యూల్లో ఆమె జాయిన అవుతుందని అంతా అన్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’ సినిమా నుంచి తప్పకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు తమిళంలో ఓ యంగ్ హీరోకు జోడిగా నటించడానికి ఒప్పుకుంది. దీంతో ఆమెకు భారీ మొత్తంలో పారితోషకం ముట్టజెప్పినట్టు సమాచారం. ఇందుకుగాను కాజల్ ఈ సినిమాకు బాగానే డేట్స్ కేటాయించనట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమా కోసం ఇచ్చిన డేట్స్ కరోనా లాక్‌డౌన్‌లో కలిసిపోయాయి. ఒకవేళ షూటింగ్ జరిగి ఉంటే ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ పూర్తైయ్యేది.

Megastar Chiranjeevi heading to Kerala for Koratala Siva movie look and will take ayurvedic medicine pk చిరంజీవి ప్రస్తుతం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సైరా కోసం బరువుతో పాటు గడ్డం కూడా పెంచిన ఈయన ఇప్పుడు నీట్ షేవ్‌లోకి వచ్చేసాడు. చాలా రోజుల నుంచి చిరు కొత్త లుక్‌లోనే కనిపిస్తున్నాడు. Chiranjeevi,Chiranjeevi twitter,Chiranjeevi instagram,Chiranjeevi new movie,Chiranjeevi sye raa movie,sye raa movie release date,Chiranjeevi sye raa release date,Chiranjeevi koratala siva,koratala siva new movie,koratala siva movies,Chiranjeevi kerala,Chiranjeevi kerala ayurvedam,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కేరళ,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి కాజల్ అగర్వాల్ (File/photo)


ఇక ముందు చేయాలంటే తమిళ సినిమా నిర్మాత నుంచి అనుమతి తీసుకోవాలి. ఒకవేళ లాక్‌డౌన్ కంప్లీటై ‘ఆచార్య’  షూటింగ్ స్టార్ట్ కావాలంటే ఎందలేదన్నా.. సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. అప్పటి పరిస్థితుల వల్ల ప్రభుత్వం సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాలి. మొత్తానికి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు చిరంజీవి ‘ఆచార్య’ నుంచి  కాజల్ అగర్వాల్ తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి కాజల్ చిరంజీవి సినిమాకు హ్యాండ్ ఇచ్చిన విషయమై ఎవరైనా అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. తాజాగా  ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన అనుష్క పేరును పరిశీలిస్తున్నారు. మరి ఈ సారైనా అనుష్క.. చిరంజీవితో నటించడానికి ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.
First published: May 2, 2020, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading