Home /News /movies /

KAJAL AGGARWAL SHARES HER SON PHOTO ON INSTAGRAM SB

Kajal Aggarwal: కాజల్ కొడుకును చూశారా... ఎలా ఉన్నాడో ?

బిడ్డతో కాజల్

బిడ్డతో కాజల్

అయితే ఇప్పటివరకు కాజల్ తన బిడ్డ ఫేస్‌ను ఎక్కడా చూపించలేదు. కానీ ఈ ఫోటోలో చిన్నారి ఫోటో దాదాపుగా కనిపిస్తుంది. చిన్నారి పెదాలు కూడా కనిపిస్తున్నాయి.

    అందాల చందమామ కాజల్(Kajal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిజినెస్ మ్యాన్‌ పెళ్లాడిన కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్(Kajal) ఎక్కడా కూడా తన కొడుకు ఫోటోను చూపించలేదు. కొడుకుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసినప్పటికీ ముఖం మాత్రం ఎక్కడా చూపించకుండా పోస్టు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా కాజల్ తన బిడ్డకు సంబంధించిన మరో ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో దాదాపుగా చిన్నారి ఫేస్ కూడా కనిపిస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోను కాజల్ అభిమానులు మరింత ఆసక్తిగా చూస్తున్నారు. చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారు.

    ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీలు తమ పిల్లల ఫోటోలను పూర్తిగా చూపించకుండా మొహం కనిపించకుండా అందుకు అనుగుణంగా వివిధ రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోహ్లీ,అనుష్క కూడా తమ కూతురు ఫోటో ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇక కాజల్ కూడా తన కొడుకు పుట్టినప్పటి నుంచి తన కొడుకు సంబంధించిన ఫోటోలు ఏవి లీక్ కాకుండా కూడా సోషల్ మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతోంది. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తన కొడుకుకి నీల్ కిచ్లూ అనే పేరును కూడా పెట్టేశారు. అయితే కాజల్ మాత్రం తల్లి అవ్వడంతో తెగ సంతోషిస్తున్నట్టు కనిపిస్తోంది. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన బిడ్డను చూసుకుంటూ కాజల్ మురిసిపోతోంది. మొత్తానికి కాజల్ ఇప్పుడు తన కొడుకు ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో బెడ్ పై పడుకొని తన కొడుకు ముఖం చూస్తూ ఉంది.



    కాజల్ 1985 జూన్ 19న ముంబాయిలో జన్నించింది. కాజల్ యాక్టర్‌తో పాటు మోడల్ కూడా. తెలుగు తమిళ భాషల్లో నటించింది. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో వెండితెరకు పరిచయం అయ్యింది. 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌(Tollywood)లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని(Ram Pothineni) తో కలిసి గణేష్ , అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.



    తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. ఇలా వరుసగా టాదాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది కాజల్. చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత  కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లాడింది. కరోనా టైంలో వీరి పెళ్లి సైలంట్‌గా జరిగిపోయింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kajal Aggarwal, Kajal aggarwal pregnant, Kajal kichlu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు