పడక గదికి పిలిచే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటున్న కాజల్..

kajal Aggarwal sesational Comments On Castiong Couch | ఇండ‌స్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు వేధింపుల గురించి ర‌చ్చ ఎక్కువైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బ‌య‌టికి వ‌చ్చి అంతా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై కాజ‌ల్ కూడా స్పందించింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 4, 2019, 10:22 PM IST
పడక గదికి పిలిచే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటున్న కాజల్..
దర్శకుడు తేజ, కాజల్ అగర్వాల్ (Teja Kajal Aggarwal)
  • Share this:
ఇండ‌స్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు వేధింపుల గురించి ర‌చ్చ ఎక్కువైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బ‌య‌టికి వ‌చ్చి అంతా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై కాజ‌ల్ కూడా స్పందించింది. సినిమా ఇండస్ట్రీలోతనమార్కెట్ గురించి తానేప్పుడు ఆలోచించలేదన్నారు. ఎప్పటి కప్పుడు తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. ఈ కారణంగానే పెళ్లి చేసుకోవాలన్న తన ఆలోచనను పక్కనపెట్టానని చెప్పుకొచ్చింది కాజల్.

తనది లవ్ మ్యారేజా.. లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా అనే ప్రశ్నకు సమాధానంగా ..తనకు నచ్చినవాడు ఎదురుపడితే.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కొంటే సమాధానమిచ్చింది. ఈ విషయంలో నేను చాలా దైర్యవంతురాలని చెప్పిన కాజల్..ఒకసారి తన ఫ్రెండ్‌పై ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడితే.. తాను అతని చొక్కా పట్టుకొని చెంప చెల్లు మనిపించానన్నారు.

ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..అవకాశాల కోసం బెడ్రూమ్‌కు పిలుస్తున్నారని చాలా మంది హీరోయిన్లు చెబుతున్నారని.. అది అబద్ధం కాదని కుండబద్దలు కొట్టింది. ఐతే అలాంటి సంఘటనలు తానెప్పుడు ఎదుర్కోలేదని వెల్లడించింది. ప్రస్తుతం కాజల్.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ‘సీత’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది.


ఇవి కూడా చదవండి

‘సైరా’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్లానింగ్

మెగా వారసుడు రామ్ చరణ్ మరో ఇంటివాడు కాబోతున్నాడు..తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టేసిన ప్రియా వారియర్...

 

video: మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత.. సీఐపై ఆందోళనకారుల రాళ్లదాడి
First published: February 4, 2019, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading