సంక్రాంతి రోజున అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కాజల్..

దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.  ఈ సంక్రాంతి సందర్భంగా కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

news18-telugu
Updated: January 15, 2020, 3:21 PM IST
సంక్రాంతి రోజున అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కాజల్..
కాజల్ అగర్వాల్ (Instagram/Photo)
  • Share this:
దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.  గతేడాది ఈ భామ నటించిన సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోయినా.. ఈ భామ మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి సంబందించిన సింగపూర్ శాఖలో ప్రతిష్టించబోవడం మాత్రం ఈమెకు పెద్ద ఊరడింపు. ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరనున్న తొలి సౌతిండియా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది. తాజాగా ఈ భామ ఈ సంక్రాంతి పండగ పురస్కరించుకొని కాజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఈ భామ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’లో నటిస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ 85 ఏళ్ల వృద్దురాలి పాత్రలో నటిస్తోంది. తాజాగా  తమిళంలో ఈ భామ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ సరసన బంపరాఫర్ కొట్టేసినట్టు సమాచారం. ఇందులో కాజల్ అగర్వాల్ కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయనటువంటి పాత్రలో నటించబోతున్నట్టు సంక్రాంతి సందర్భంగా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు. షూటింగ్ ఎపుడు మొదలవుతుంది తదితర విషయాలను త్వరలో తెలియాల్సి ఉంది. 

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు