Kajal Aggarwal: తన ప్రేమ విఫలం పై స్పందించిన కాజల్ అగర్వాల్..

ఇప్పటివరకూ తనకు ఎదురపడ్డ వాళ్లందరిలోనూ నేను స్నేహితుడ్నే చూశాననీ చెప్పుకొచ్చింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.  ప్రేమికుడు, లైఫ్ పార్టనర్‌గా ఇప్పటి వరకు ఎవరినీ చూడలేదని చెప్పిన కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట మార్చింది. తనకు సినిమాలలోకి రాకముందే లవ్ ట్రాక్ ఉందని ఆ ఇంటర్వ్యూలో  వెల్లడించింది.

news18-telugu
Updated: June 13, 2019, 1:40 PM IST
Kajal Aggarwal: తన ప్రేమ విఫలం పై స్పందించిన కాజల్ అగర్వాల్..
కాజల్ అగర్వాల్ Photo: Twitter.com/MsKajalAggarwal
  • Share this:
ఇప్పటివరకూ తనకు ఎదురపడ్డ వాళ్లందరిలోనూ నేను స్నేహితుడ్నే చూశాననీ చెప్పుకొచ్చింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.  ప్రేమికుడు, లైఫ్ పార్టనర్‌గా ఇప్పటి వరకు ఎవరినీ చూడలేదని చెప్పిన కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట మార్చింది. తనకు సినిమాలలోకి రాకముందే లవ్ ట్రాక్ ఉందని ఆ ఇంటర్వ్యూలో  వెల్లడించింది. ప్రేమకు ముఖ్యం ప్రేమికులు ఒకరినొకరు చూస్తూ.. అప్పుడప్పుడు కలవడం వంటివే. కానీ అలాంటి అవకాశాలు లేకపోవడం వల్లే ప్రేమికుడు తనకు దూరమయ్యాడని కాజల్ చెప్పుకొచ్చింది.సినిమాలలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక వ్యక్తితో పరిచయం ప్రేమగా మారిందన్నారు. ఐతే అతనికి సినిమా రంగం అంటే అంతగా సదభిప్రాయం లేదు.  కానీ నేను మాత్రం సినిమాల్లో నటించడం, సినిమా షూటింగ్‌లో పాల్గొనడం వల్ల ప్రేమికుడి కోసం సరైన సమయం కేటాయించలేకపోయాను. అందుకే అతని  ప్రేమను కోల్పోయానని తెలిపింది. అతనితో చనువుగా వుండలేకపోవడం.. అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగకపోవడం వల్లే తన ప్రేమ మాయమైందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ హీరోయిన్‌గా నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు కమల్ హాసన్‌తో చేయాల్సిన ‘భారతీయుడు2’ సినిమా ఆలస్యం కావడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 13, 2019, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading