Kajal Aggarwal: తన వయసెంతో చెప్పి షాక్‌కు గురిచేసిన కాజల్..

కాజల్ అగర్వాల్ వయసు ఎంతో తెలుసా.. తెలుసుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా ? ఎంచక్కా వీకిపీడియా చూస్తే సరిపోతుంది కదా.. ఈ సోదంత ఎందుకంటారా.. ఏమి లేదు...

news18-telugu
Updated: October 24, 2019, 2:25 PM IST
Kajal Aggarwal: తన వయసెంతో చెప్పి షాక్‌కు గురిచేసిన కాజల్..
కాజల్ అగర్వాల్ (Instagram/Twitter)
  • Share this:
కాజల్ అగర్వాల్ వయసు ఎంతో తెలుసా.. తెలుసుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా ? ఎంచక్కా వీకిపీడియా చూస్తే సరిపోతుంది కదా.. ఈ సోదంత ఎందుకంటారా.. ఏమి లేదు... తాజాగా కాజల్ అగర్వాల్ తన వయసు 90 ఏళ్లు అని చెప్పి షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ భామ.. శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమ ా చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. 85 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ 90 ఏళ్ల సేనాపతి పాత్రలో నటిస్తున్నాడు. ఆ 90ఏళ్ల్ కమల్ హాసన్ సరసన 85 ఏళ్ల బామ్మ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్..పోరాట మర్మకళలు తెలిసిన యువతిగా నటిస్తోంది.

మళ్లీ వృద్ధుడిగా కమల్‌ నటిస్తున్నారు. ‘90 ఏళ్ల వృద్ధుడి పాత్ర కోసం వైవిధ్యమైన పోరాట సన్నివేశాన్ని కంపోజ్‌ చేస్తున్న’ట్లు ఇటీవల స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ కూడా చెప్పారు. దీంతో కాజల్‌ పాత్ర ఎలా ఉంటుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి కాజల్‌ స్పందిస్తూ.. ‘‘ ఈ చిత్రంలో స్వీయ రక్షణ కళలు తెలిసిన అమ్మాయిగా నటిస్తున్నా. కానీ ఆ పాత్ర వయసు గురించి చెప్పను. వచ్చే నెలలో తైవాన్‌లో చిత్రీకరణ జరుగనుంది. అందులో నేను కూడా పాల్గొంటానని’’ పేర్కొన్నారు. త్వరలో తైవాన్‌లో ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు