Kajal Aggarwal: కాజల్ కోసం రూ.60 లక్షలు పోగుట్టుకున్న ఫ్యాన్..

Kajal Aggarwal | టెక్నాలజీ ఎంత పెరిగినా.. మోసాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికే మోసపోయే వాళ్లు మోసపోతునే ఉన్నారు. అందులో చదువుకున్న వాళ్లు ఇలాంటి మోసాలకు బలైపోతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్‌కు వీరాభిమాని అయిన ఒక వ్యక్తి ఇలానే మోసపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 2, 2019, 11:36 AM IST
Kajal Aggarwal: కాజల్ కోసం రూ.60 లక్షలు పోగుట్టుకున్న ఫ్యాన్..
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Twitter)
news18-telugu
Updated: August 2, 2019, 11:36 AM IST
టెక్నాలజీ ఎంత పెరిగినా.. మోసాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికే మోసపోయే వాళ్లు మోసపోతునే ఉన్నారు. అందులో చదువుకున్న వాళ్లు ఇలాంటి మోసాలకు బలైపోతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్‌కు వీరాభిమాని అయిన ఒక వ్యక్తి ఇలానే మోసపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కాజల్ అగర్వాల్ విపరీతంగా అభిమానించే వ్యక్తి ఇలానే సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి రూ.60 లక్షలు  పోగుట్టుకున్నాడు. ఇలా విడతల వారిగా సైబర్ నేరగాళ్లు అతని నుంచి రూ.60 లక్షలు లాగుక్కోగా.. ఆ తర్వాత సదరు వ్యక్తి ఇంట్లో నుంచి పారిపోయాడు. దాంతో పోలీసులు రంగ ప్రవేశంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన బాగా డబ్బున్న ఒక శ్రీమంతుడు కొడుకుకు కాజల్ అంటే ఎంతో ఇష్టం. ఒక రోజు ఇంటర్నెట్‌ను చాట్ చేస్తుండగా.. మీకు బాగా ఇష్టమైన స్టార్‌తో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తామంటూ ఒక ప్రకటన వచ్చింది. దానికి ఆకర్షితుడైన అతడు క్లిక్ చేసి అతని వివరాలు ఇచ్చాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి అతనికి కాజల్‌ను పరిచయం చేస్తానంటూ ముందుగా రూ.50 వేలు అడిగాడు.ఆ తర్వాత ఇంకొంత అమౌంట్ డిమాండ్ చేసాడు. విడతల వారీగా అతడు అడిగిన అమౌంట్ వేస్తూనే ఉన్నాడు.

కాజల్ అగర్వాల్ (పైల్ ఫోటో)


ఇలా రూ.10 లక్షల వరకు సమర్పించుకున్న తర్వాత  అతను ఎంతకు కాజల్‌ను పరిచయం చేయకపోవడంతో చిర్రెత్తుకొచ్చి.. కాజల్‌‌ను తనకు ఎపుడు పరిచయం చేస్తావంటూ కాస్త గట్టిగానే అడగడంతో సదరు చాట్ చేసిన వ్యక్తి..అతనికి తనకు చేసిన ఫోక్ కాల్ డాటా సహా మొత్తం భండారం బయట పెట్టేస్తానంటూ  బ్లాక్ మెయిల్ చేసాడు. ఆ తర్వాత అతడి బ్లాక్ మెయిలర్ అతడి నుంచి ఏకంగా రూ.60 లక్షల వరకు లాగాడు.  ఆ తర్వాత ఆగకుండా ఇంకా పీడించడంతో అతడు వారి బాధను తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడు కనపడటం లేదని కంప్లైట్ చేయడంతో మొత్తం విషయం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు.. కాజల్ అగర్వాల్ పేరుతో మోసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...