Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 4, 2019, 10:49 PM IST
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్
అసలే బయట చలి చంపేస్తుంది. అక్కడ చలే తట్టుకోలేకపోతుంటే.. ఇక్కడ తన అందాలతో మరింత గిలి పుట్టిస్తుంది కాజల్ అగర్వాల్. కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. అప్పుడు ఆయన చేసాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు కాజల్ మాత్రం ఇదే చేస్తుంది. తన కంటిచూపుతోనే అందర్నీ మాయ చేయడమే కాదు.. చూపు తిప్పుకోలేని విధంగా తన మాయాజాలంలో పడేస్తుంది. తాజాగా విడుదలైన ఫోటోషూట్‌లో అమ్మడి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండలేం. అంతగా కసెక్కించే చూపులతో ప్రాణాలు తీస్తుంది కాజల్ అగర్వాల్.

కాజల్ అగర్వాల్ (Image: kajal aggarwal / Facebook)
తన అందాలను చూపించీ చూపించకుండానే చూపించింది ఈ చందమామ. పైగా నవ్వితే రత్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్‌తో పిచ్చెక్కించింది కాజల్. తాజాగా మరో ఫోటోషూట్ కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోలతో నటించడం లేదు కానీ స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్‌తో తేజ తెరకెక్కించిన సీత సినిమాలో నటించింది కాజల్. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. అయితే సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. దాని వెనక ఉన్న అసలు కారణం ఫోటోషూట్స్ రూపంలో కోట్లకు కోట్లు రావడమే.

కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Twitter)
తెలుగులో ప్రస్తుతం కాజల్ పెద్దగా సినిమాలేవీ చేయడం లేదు కానీ తమిళనాట మాత్రం రెండు సినిమాలతో బిజీగా ఉంది. క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ నటించినా కూడా విడుదల కావడం లేదు. కమల్ హాసన్ భారతీయుడు 2లో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. మధ్య మధ్యలో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. వీటితో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని ఈ భామ సంపాదిస్తుందనే టాక్ వినిపిస్తుంది. దానికితోడు వెబ్ సిరీస్ వైపు కూడా అడుగులు వేస్తుంది కాజల్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కాజల్ వెబ్ సిరీస్ చేస్తుంది.

కాజల్ అగర్వాల్ (ఫైల్ ఫోటో)
ఇంత బిజీగా ఉన్నా కూడా ఫోటోషూట్స్‌తో కోట్లు వస్తుండటంతో కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు రెచ్చిపోతుంది. ఈ మధ్య కాలంలో మూడు నాలుగు రోజులకోసారి హాట్ ఫోటోషూట్స్ విడుదల చేస్తుంది కాజల్. ఇది కూడా ఈ భామకు బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇలా చూపులతోనే ఊపిరి ఆపేసింది ఈ ముద్దుగుమ్మ. గతేడాది వరసగా స్టార్ హీరోలతో నటించిన కాజల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటుంది. కానీ రెమ్యునరేషన్ మాత్రం సినిమాకు కోటిన్నరకు పైగానే తీసుకుంటూ రచ్చ చేస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 4, 2019, 10:49 PM IST