news18-telugu
Updated: May 9, 2020, 12:14 PM IST
తెలుగు వంటకాలు చేసిన కాజల్ Photo : Twitter
కాజల్ అగర్వాల్.. ఈ అందాల మెరుపుతీగను తెలుగుతెరకు తేజ పరిచయం చేసినా.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇక అప్పటినుండి దాదాపు ఓ దశాబ్దం కాలంగా తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది. కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది. దీంతో పాటు చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న ఆచార్యలో కూడ అలరించనుంది. కాగా కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో ఇంట్లోనే ఉంటున్న కాజల్.. వంటిట్లో రకరకాల వంటలు చేస్తూ వాటిని తన ఫ్యామిలీతో కలిసి ఆరగించేస్తోంది. దీనికి సంబందించిన ఓ ఫోటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో కాజల్ రాస్తూ.. తెలుగు వంటకాల్నీ చాలా మిస్ అవుతున్నానని.. షూటింగ్లో ఉంటే అవి చాలా ఇష్టంగా తినేదాన్ని కానీ కరోనా వల్ల షూటింగ్ బంద్ అవ్వడంతో తనకు ఇష్టమైన బెండకాయ పులుసు, పెసరట్టు, సోరకాయ పచ్చడి వంటల్నీ చేశానని చెప్పింది. దీనికి సంబందించిన పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. దీంతో వావ్ కాజల్ నువ్వు అదరగొట్టావ్.. సమోసాలు సూపర్.. అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
Published by:
Suresh Rachamalla
First published:
May 9, 2020, 12:14 PM IST