HOME » NEWS » movies » KAJAL AGGARWAL LOOKING AFTER HORROR MOVIES AFTER MARRIAGE AND SIGNED ONE PROJECT ALSO PK

Kajal Aggarwal: పెళ్ళి తర్వాత ఇలాంటి సినిమాలేంటి కాజల్.. కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్..

Kajal Aggarwal: 14 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ చేసిన సినిమాలు వేరు.. ఇప్పుడు ఒప్పుకుంటున్న సినిమాలు వేరు. మొన్నటికి మొన్న అక్టోబర్ 30న తను ప్రేమించిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది కాజల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 1, 2020, 10:39 PM IST
Kajal Aggarwal: పెళ్ళి తర్వాత ఇలాంటి సినిమాలేంటి కాజల్.. కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్..
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
  • Share this:
14 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ చేసిన సినిమాలు వేరు.. ఇప్పుడు ఒప్పుకుంటున్న సినిమాలు వేరు. మొన్నటికి మొన్న అక్టోబర్ 30న తను ప్రేమించిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ఇప్పటికే ప్రకటించింది కాజల్. దానికి తగ్గట్లుగానే వరస సినిమాలు అనౌన్స్ చేస్తుంది చందమామ. పెళ్లి తర్వాత కూడా ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ఆచార్యతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తుంది. మరోవైపు తమిళనాట కూడా భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. మరిన్ని సినిమాలు కూడా కాజల్ కోసం వేచి చూస్తున్నాయి. అయితే పెళ్ళి తర్వాత నటన కొనసాగిస్తున్నా కూడా గ్లామర్ పాత్రలకు మాత్రం నో చెప్తుందనే ప్రచారం జరుగుతుంది. మొదట్నుంచి కూడా గ్లామర్ ప్లస్ ఫ్యామిలీ రోల్స్ చేస్తుంది చందమామ. మధ్యలో కొన్నిసార్లు దడ లాంటి సినిమాల్లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. అయితే ఇప్పుడు అలాంటివి కుదరదు అంటుంది.
kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal movies,kajal aggarwal marriage,kajal aggarwal horror movies,kajal aggarwal horror after marriage,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హార్రర్ సినిమా
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు (kajal aggarwal gautam kitchlu)


ఇప్పటి వరకు కమర్షియల్ పాత్రలు చేస్తూ వచ్చిన కాజల్.. ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల వైపు చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ సినిమాకు ఓకే చెప్పింది కాజల్. ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ టచ్ చేయని హార్రర్ పాత్రలో కాజల్ కనిపించబోతుంది. డికే అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే కథ నచ్చి ఒప్పుకుంది కాజల్. ఈ చిత్రంలో చందమామతో పాటు మరో ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా నటించబోతున్నారు. నలుగురు హీరోయిన్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.
kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal movies,kajal aggarwal marriage,kajal aggarwal horror movies,kajal aggarwal horror after marriage,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హార్రర్ సినిమా
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal/Twitter)

ఇన్నేళ్ళ కెరీర్‌లో ఒక్కసారి కూడా హార్రర్ సినిమా చేయలేదు కాజల్. కానీ పెళ్ళైన నెల రోజులకే అలాంటి జోనర్‌కు వెళ్లిపోయింది చందమామ. కుమారిగా ఉన్నపుడు కూల్ అండ్ క్యూట్ సినిమాలు చేస్తూ మనసులు గెలుచుకున్న కాజల్ అగర్వాల్.. శ్రీమతి అయిన తర్వాత హార్రర్ సినిమాల వైపు వెళ్తుంది. మరి ఇదేం చిత్రమో కాజల్‌కే తెలియాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: December 1, 2020, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading