• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KAJAL AGGARWAL KAJAL IS ANOTHER RARE RECORD THE FIRST HEROINE TO ROMANCE WITH NAGAJUNA NAGA CHAITANYA AND CHIRANJEEVI RAM CHARAN IN THIS GENERATION TA

Kajal Aggarwal: కాజల్ మరో అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో ఆ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్..

Kajal Aggarwal: కాజల్ మరో అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో ఆ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్..

కాజల్ అగర్వాల్ Instagram

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో మరో అరుదైన రికార్డు అందుకుంది.  ఈ జనరేషన్‌లో ఆ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో మరో అరుదైన రికార్డు అందుకుంది.  ఈ జనరేషన్‌లో ఆ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. వివరాల్లోకి వెళితే.. చిత్ర పరిశ్రమలో కొడుకుతో యాక్ట్ చేసిన హీరోయిన్లు.. తండ్రితో నటించడం చాలా అరుదుగా ఉంటారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఈ జనరేషన్‌లో కాజల్.. రామ్ చరణ్‌తో ‘మగధీర’ ‘నాయక్’, ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమాల్లో జోడిగా నటించింది. ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో చిరు సరసన ఆడిపాడింది. ఇపుడు మరోసారి ’ఆచార్య’ సినిమాలో చిరుకు జోడిగా నటిస్తోంది.

    ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ రెండు సినిమాల్లో రామ్ చరణ్, చిరంజీవి‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

    చిరంజీవి, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ (File/Photo)


    అంతేకాదు.. కాజల్ అగర్వాల్.. అక్కినేని నాగ చైతన్యతో దడ సినిమాలో యాక్ట్ చేసింది. తాజాగా నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో కాజల్ అగర్వాల్ నాగార్జున సరసన నటిస్తోంది. ఈ జనరేషన్‌లో అటు చిరంజీవి, రామ్ చరణ్ వంటి తండ్రి తనయులుతో పాటు నాగార్జున, నాగ చైతన్య ఇద్దరితో నటించిన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది.

    నాగార్జున, కాజల్ అగర్వాల్, నాగ చైతన్య (File/Photo)


    మరోవైపు ఈ జనరేషన్‌లో  తమన్నా కూడా  రామ్ చరణ్‌ సరసన ‘రచ్చ’లో ఓ రేంజ్‌లో తన అందాలతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో మెగాస్టార్ సరసన మెరిసింది.

    చిరంజీవి, తమన్నా, రామ్ చరణ్ (File/Photo)


    మరోవైపు తమన్నా, నాగ చైతన్య, నాగార్జునతో ’ఊపిరి’లో  నటించింది. నాగ చైతన్య  సరసన కథానాయికగా నటించిన తమన్నా.. నాగార్జున పక్కన హీరోయిన్‌గా నటించలేదు.రకుల్ ప్రీత్ సింగ్.. నాగ చైతన్య సరసన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత చైతూ ఫాదర్ నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ లో నాగ్‌కు జోడిగా నటించింది.

    నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, నాగ చైతన్య (File/Photos)


    అటు లావణ్య త్రిపాఠి కూడా నాగ చైతన్యతో ‘యుద్ధం శరణం’లో జోడిగా నటించింది. అటు నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ రకంగా ఈ జనరేషన్‌లో తెలుగు సినీ ఇండస్ట్రీలో  కథానాయికలుగా వీళ్లు తండ్రీ కొడుకులు సరసన నటించారు.

    నాగార్జున, లావణ్య త్రిపాఠి, నాగ చైతన్య (File/Photos)


    మొత్తంగా ఈ జనరేషన్‌లో నలుగురు హీరోయిన్లు తండ్రి కొడుకులతో నటించినా.. కాజల్ అగర్వాల్ మాత్రం.. అటు అక్కినేని ఫాదర్ అండ్ సన్స్ (నాగార్జున  నాగ చైతన్య) ‌తో పాటు కొణిదెల తండ్రి తనయులు ( చిరంజీవి, రామ్ చరణ్)‌లతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏమైనా ఈ జనరేషన్‌లో ఈ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: