కాజల్ అగర్వాల్‌కు ఏమైంది.. అప్పుడే చెల్లి ఎందుకు అయిపోయింది..?

హీరోయిన్లు.. అందులోనూ స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి చెల్లి పాత్రలు చేయమంటే నో అంటారు. అసలు తమకేం తక్కువ.. చెల్లి పాత్రలో ఎందుకు నటిస్తాం అంటూ మొహం మీదే నో చెప్పేస్తుంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 17, 2019, 7:59 AM IST
కాజల్ అగర్వాల్‌కు ఏమైంది.. అప్పుడే చెల్లి ఎందుకు అయిపోయింది..?
కాజల్ అగర్వాల్ (Image: kajal aggarwal / Facebook)
  • Share this:
హీరోయిన్లు.. అందులోనూ స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి చెల్లి పాత్రలు చేయమంటే నో అంటారు. అసలు తమకేం తక్కువ.. చెల్లి పాత్రలో ఎందుకు నటిస్తాం అంటూ మొహం మీదే నో చెప్పేస్తుంటారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తుంది. డబ్బులు ఎక్కువిస్తున్నారని చేస్తుందో.. లేదంటే నిజంగానే కథకు కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు మంచు విష్ణుకు చెల్లి అయిపోయింది ఈ భామ. అయినా కాజల్ లాంటి హీరోయిన్‌ను చెల్లి అనాలంటే ఎవరికైనా కాస్త కష్టమే. కానీ కథ డిమాండ్ చేసింది కాబట్టి విష్ణుకు తప్పడం లేదు.
Kajal Aggarwal is going to play sister role for Manchu Vishnu in her Next movie pk హీరోయిన్లు.. అందులోనూ స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి చెల్లి పాత్రలు చేయమంటే నో అంటారు. అసలు తమకేం తక్కువ.. చెల్లి పాత్రలో ఎందుకు నటిస్తాం అంటూ మొహం మీదే నో చెప్పేస్తుంటారు. Manchu Vishnu,Manchu Vishnu twitter,Manchu Vishnu wife,kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal raksha bhandan,kajal aggarwal manchu vishnu sister,kajal aggarwal manchu vishnu movie,Manchu Vishnu kajal aggarwal,Manchu Vishnu wife viranica,Manchu Vishnu father,Manchu Vishnu wife viranica pregnancy,viranica delivery,Manchu Vishnu kajal movies,kajal aggarwal instagram,manchu vishnu instagram,mohan babu manchu,telugu cinema,మంచు విష్ణు,మంచు విష్ణు కాజల్,మంచు విష్ణు చెల్లిగా కాజల్ అగర్వాల్,మంచు విష్ణు భార్య విరానిక,మంచు విష్ణు కాజల్ అగర్వాల్,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ (Source: Twitter/ Kajal Aggarwal)

ఈ ఏడాది ఇప్పటికే తేజ దర్శకత్వంలో సీత.. శర్వానంద్ రణరంగం సినిమాలు చేసింది కాజల్. ఇందులో సీత డిజాస్టర్ కాగా.. రణరంగం పర్లేదు అనిపించింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ జోడీకట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విష్ణుకు సోదరిగా నటిస్తుండటం విశేషం. అసలు హీరోయిన్ కాస్త చెల్లి ఎందుకు అయిందబ్బా అనుకోవచ్చు.. కానీ దానికి కూడా ఓ కారణం ఉంది. చాలా రోజులుగా విష్ణును ఓ కథ వెంటాడుతుంది.

Kajal Aggarwal is going to play sister role for Manchu Vishnu in her Next movie pk హీరోయిన్లు.. అందులోనూ స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి చెల్లి పాత్రలు చేయమంటే నో అంటారు. అసలు తమకేం తక్కువ.. చెల్లి పాత్రలో ఎందుకు నటిస్తాం అంటూ మొహం మీదే నో చెప్పేస్తుంటారు. Manchu Vishnu,Manchu Vishnu twitter,Manchu Vishnu wife,kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal raksha bhandan,kajal aggarwal manchu vishnu sister,kajal aggarwal manchu vishnu movie,Manchu Vishnu kajal aggarwal,Manchu Vishnu wife viranica,Manchu Vishnu father,Manchu Vishnu wife viranica pregnancy,viranica delivery,Manchu Vishnu kajal movies,kajal aggarwal instagram,manchu vishnu instagram,mohan babu manchu,telugu cinema,మంచు విష్ణు,మంచు విష్ణు కాజల్,మంచు విష్ణు చెల్లిగా కాజల్ అగర్వాల్,మంచు విష్ణు భార్య విరానిక,మంచు విష్ణు కాజల్ అగర్వాల్,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ మంచు విష్ణు దంపతులు (Source: Twitter)

అందులో చెల్లి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్నా కూడా చివరికి కాజల్ వచ్చి చేరింది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు హైలైట్. అందుకే విష్ణుకు చెల్లిగా కాజల్‌ నటిస్తుంది. రాఖీ పండగ సందర్భంగా హ్యాపీ రాఖీ అర్జున్ అంటూ షూటింగ్ లొకేషన్ నుంచి ఫోటోను షేర్ చేసింది కాజల్. ఈ సినిమాలో విష్ణు పాత్ర పేరు అర్జున్.. అతడి చెల్లి కాజల్. మొత్తానికి మరి ఈ మోడ్రన్ అన్నాచెల్లెళ్ల కథ ఎలా ఉండబోతుందో చూడాలి.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు