విమర్శలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. కాజల్ అగర్వాల్..

ఇప్పటికే అగ్ర కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న కాజల్ అగర్వాల్‌కు కెరీర్ తొలినాళ్లలో తన విమర్శిస్తూ రాసేవాళ్ల అంటే పీకల దాక కోపం ఉండేదట. తొలినాళ్లలో ఎవరైనా విమర్శిస్తే.. అసలు సహించక పోయేదాన్ని.

news18-telugu
Updated: December 2, 2019, 12:29 PM IST
విమర్శలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. కాజల్ అగర్వాల్..
కాజల్ అగర్వాల్ (Instagram/kajalaggarwalofficial)
  • Share this:
తెలుగులో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో కథానాయికగా అడుగుపెట్టి.. ‘చందమామ’గా తొలి హిట్టు అందుకొని.. ‘మగధీర’లో మిత్రవిందగా టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఇప్పటికే అగ్ర కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న కాజల్ అగర్వాల్‌కు కెరీర్ తొలినాళ్లలో తన విమర్శిస్తూ రాసేవాళ్ల అంటే పీకల దాక కోపం ఉండేదట. తొలినాళ్లలో ఎవరైనా విమర్శిస్తే.. అసలు సహించక పోయేదాన్ని. దాంతో అన్నీ తప్పులే కనిపించేవి. అవే మనసులో పెట్టుకొని పనిచేయడంతో ఆ ప్రభావం చేసే పనిపై స్పష్టంగా కనిపించేది. ఆ తర్వాత ఆ విమర్శను స్వీకరించి.. తనలో ఉన్న లోపాలు గుర్తించగలిగాను. దాంతో రానురాను నా నటనలో మరింత మార్పు కనిపించింది. ఒక్కోసారి మనము మంచిగా పనిచేసినా.. విమర్శించే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లవల్ల నేను ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసా. మన పని విషయంలో సంతృప్తిగా ఉండలేం. సంతృప్తి లేకపోతే ప్రయాణాన్ని ఆస్వాదించలేమంటూ చెప్పుకొచ్చింది. అపుడే మన విజయాలను ఆస్వాదించగలుగుతాం.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>