ప్రభాస్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటున్న హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్..

ప్రభాస్.. ఇప్పుడు ఈయన తెలుగు హీరో కాదు.. నేషనల్ వైడ్ స్టార్. బాహుబలి సినిమా అంటే రాజమౌళి సాయంతో వెళ్లి రికార్డులు తిరగరాసాడు యంగ్ రెబల్ స్టార్. కానీ సాహోతో మాత్రం సోలోగా వెళ్లి బాలీవుడ్‌లో సత్తా చూపించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 7:32 PM IST
ప్రభాస్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటున్న హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్..
కాజల్ అగర్వాల్ ప్రభాస్ (Source: Twitter)
  • Share this:
ప్రభాస్.. ఇప్పుడు ఈయన తెలుగు హీరో కాదు.. నేషనల్ వైడ్ స్టార్. బాహుబలి సినిమా అంటే రాజమౌళి సాయంతో వెళ్లి రికార్డులు తిరగరాసాడు యంగ్ రెబల్ స్టార్. కానీ సాహోతో మాత్రం సోలోగా వెళ్లి బాలీవుడ్‌లో సత్తా చూపించాడు. ఈ చిత్రం అక్కడ 150 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. అంటే బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకున్నాడు ప్రభాస్. తెలుగులో సాహో ఫ్లాప్ అయినా కూడా ఈయన కెరీర్ మాత్రం ఎదిగిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే చెప్పింది. తాజాగా అభిమానులతో ఛాటింగ్ చేసిన కాజల్.. ప్రభాస్ గురించి వచ్చిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.


ప్రభాస్‌ కెరీర్‌ను చూస్తుంటే నిజంగా ఆనందంగా ఉంది.. అంతకంటే ఎక్కువ గర్వంగానూ ఉందని చెప్పుకొచ్చింది చందమామ. ముఖ్యంగా అతడు కెరీర్‌లో ఎదిగిన విధానం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుందని చెప్పింది కాజల్. గతంలో ఆయనతో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతుంది కాజల్. ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచినందుకు గర్వంగా ఉందంటూ ప్రభాస్‌ను మునగచెట్టెక్కించింది కాజల్. గతంలో ఈ ఇద్దరూ కలిసి నటించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు మంచి విజయం సాధించాయి.

Kajal Aggarwal Interesting comments about Sensational star Prabhas and says she is proud of him pk ప్రభాస్.. ఇప్పుడు ఈయన తెలుగు హీరో కాదు.. నేషనల్ వైడ్ స్టార్. బాహుబలి సినిమా అంటే రాజమౌళి సాయంతో వెళ్లి రికార్డులు తిరగరాసాడు యంగ్ రెబల్ స్టార్. కానీ సాహోతో మాత్రం సోలోగా వెళ్లి బాలీవుడ్‌లో సత్తా చూపించాడు. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal facebook,kajal aggarwal prabhas,kajal aggarwal prabhas darling,kajal aggarwal movies,kajal aggarwal prabhas mr perfect,kajal aggarwal hot,kajal aggarwal hot photos,kajal aggarwal hot images,telugu cinema,prabhas saaho,prabhas bahubali,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ ప్రభాస్,కాజల్ అగర్వాల్ డార్లింగ్ ప్రభాస్,కాజల్ హాట్,తెలుగు సినిమా
ప్రభాస్ కాజల్ అగర్వాల్ (Source: Twitter)
ఆ తర్వాత కలిసి నటించడానికి కథ కుదర్లేదు. ఇప్పుడు కూడా తాను ఛాన్స్ వస్తే ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి సిద్ధమే అంటూ ప్రకటించింది కాజల్ అగర్వాల్. మరి ఈ ఇద్ధరినీ కలిపే దర్శకుడు ఎక్కడున్నాడో..? మరోవైపు ఈ మధ్యే సాహో ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ డ్రస్సింగ్‌పై సంచలన కామెంట్స్ చేసాడు ప్రభాస్. తనకు మొదట్లో కాజల్ డ్రస్సింగ్ చూస్తే చిరాకు వచ్చేదని.. కానీ ఆ తర్వాత మెల్లగా మారుతూ ఇప్పుడు సూపర్‌గా మేకోవర్ అయిందంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading